మే5న చంద్ర గ్రహణం ఈరాశులవారికి అదృష్టాన్ని తెస్తోంది
ఈ ఏడాది ఇప్పటికే తొలి సూర్యగ్రహణం ఏర్పడింది. మొదటి చంద్ర గ్రహణం మే 5వ తేదీన ఏర్పడబోతోంది. చంద్రుడికి, సూర్యుడికి మధ్య భూమి వస్తే చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. ఆరోజు వైశాఖ పౌర్ణమి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణ ప్రభావం 12 రాశులపై ఉన్నప్పటికీ కొన్ని రాశులకు మరింత సానుకూలత ఉంటుంది. ఆ రాశులేంటనేది చూద్దాం.
మిథున రాశి : మొదటి చంద్ర గ్రహణం ఈ రాశివారికి అదృష్టాన్ని తెస్తోంది. ఉద్యోగస్తులకు వేతనంలో పెరుగుదలతోపాటు పదోన్నతి లభిస్తుంది. కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూసేవారు విజయం సాధిస్తారు. ఆర్థిక స్థితి బలపడుతుంది. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులకు లాభాలు కలుగుతాయి. అదృష్టం కలిసివస్తుంది. విదేశాలకు వెళ్లాలని ఆలోచించేవారు అడుగు ముందుకు వేసేందుకు ఇదే సరైన సమయం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ సమయం బాగా కలిసివస్తుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. ఎక్కడా మాట తూలకుండా జాగ్రత్త వహించాలి.

సింహ రాశి : గ్రహణం సింహరాశివారికి అనుకూల ఫలితాలనిస్తోంది. కొత్త ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు, నూతన ప్రణాళికలను అమలు చేసేందుకు ఇది సరైన సమయం అవుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరగడంతోపాటు పలు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకున్న పనులు పూర్తికావడంతోపాటు అన్నింటా మంచి ఫలితాలు లభిస్తాయి. కోర్టు కేసు ఏదైనా ఉంటే అందులో మీకు ఉపశమనం కలుగుతుంది. కోర్టు ఇచ్చే తీర్పు మీకు అనుకూలంగా మారుతుంది. అనవసర చర్చలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం కానీ, ఇతర పోటీపరీక్షలకు సిద్ధపడుతున్నవారు తీవ్రంగా చెమటోడ్చాల్సి ఉంటుంది.
మకర రాశి : మకరరాశివారికి ఆర్థిక లాభాలుంటాయి. స్థిరాస్తులు వృద్ధి చేసేందుకు ధైర్యంగా అడుగు ముందుకు వేయవచ్చు. వాహన యోగం కూడా ఉంది. కెరీర్ లో ముందుకు సాగుతారు. ఉద్యోగస్తులకు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. అంతేకాకుండా నూతన ప్రణాళికలు అమలు చేసేందుకు అనుకూల సమయం ఇదే అవుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంది. అలాగే ఇక రాదు అని వదిలేసుకున్న డబ్బులు వసూలయ్యే అవకాశం కనపడుతోంది. మీ పనితీరువల్ల అందరి నుంచి మంచి గౌరవం దక్కుతుంది.












Click it and Unblock the Notifications