ఫిబ్రవరి 17న నవపంచమ రాజయోగం .. వీరికి కుబేర యోగం!
వేద జ్యోతిష్య శాస్త్రంలో ఫిబ్రవరి 17వ తేదీన దేవతల గురువు అయిన బృహస్పతి, గ్రహాల రాకుమారుడు అయిన బుధుడు తో కలిసి నవ పంచమ రాజయోగం ఏర్పరుస్తూ ఉన్నాడు. గ్రహాలలో శక్తివంతంగా భావించే బృహస్పతి ప్రతి రాశిలోనూ ఒక సంవత్సరం పాటు ఉంటాడు. అయితే 2026 సంవత్సరంలో మాత్రం మూడుసార్లు రాశులను మారుస్తూ సంచారం చేస్తున్నాడు.
నవపంచమ రాజయోగంతో అదృష్ట రాశులు
ప్రస్తుతం బృహస్పతి మిధున రాశిలో ఉన్నాడు. జూన్ రెండవ తేదీ వరకు అక్కడే ఉంటాడు. మిధున రాశి లోని బృహస్పతి బుధుడితో సంయోగం చెంది ఏర్పరిచిన నవ పంచమ రాజయోగం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. మరి ఆ రాశుల గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.

కర్కాటక రాశి
కర్కాటక రాశి జాతకులకు నవ పంచమ రాజయోగం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి అదృష్ట అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతారు. జీవితంలో సంతోషాలు వస్తాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. ప్రేమ సంబంధాలు బలపడతాయి. బ్యాంకింగ్ మరియు పరిశోధనలు రంగం వారికి కలిసి వస్తుంది. స్నేహితుల నుండి మద్దతు లభిస్తుంది. అనవసరపు ఖర్చులు తగ్గుతాయి.
కుంభరాశి
నవ పంచమ రాజయోగం కుంభరాశి జాతకులకు ప్రయోజనాలను చేకూరుస్తుంది. బుధుడు ఈ రాశిలో లగ్న గృహంలో, బృహస్పతి ఐదవ ఇంట్లో ఉండడం వల్ల ఈ రాశి జాతకులు ఏ కోరికలు కోరుకున్న నెరవేరుతాయి. సూర్యుడు మరియు శుక్రుడు ఈ రాశిలో ఉండడంవల్ల అదృష్టం మీకు కలిసి వస్తుంది. చాలాకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. సంపద లభిస్తుంది. పొదుపు కూడా సాధ్యమవుతుంది.
మీనరాశి
నవపంచమ రాజయోగం మీనరాశి జాతకులకు శుభవార్తను తెస్తుంది. ఈ రాశి యొక్క 12వ ఇంట్లో బుధుడు ఉండడంవల్ల ఈ రాశి జాతకులకు సుఖాలు, విలాసాలు పెరుగుతాయి. ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. గృహాలు, ఆస్తులు కొనాలనుకునే వారి కోరిక నెరవేరుతుంది. మీ కృషి, అంకితభావం ఫలిస్తాయి. అపారమైన విజయాలను సాధిస్తారు. ఆర్థిక స్థితి మెరుగు పడుతుంది. కొత్త ఆదాయ వనరులు కనిపిస్తాయి.
ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు మరియు ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications