నవ పంచమ రాజయోగంతో ఈ రాశులవారికి సంపద
గ్రహాల రాశి పరివర్తనం యోగాన్ని ఏర్పరుస్తుంది. ఆ యోగం ప్రభావం కొన్నింటిపై శుభప్రదంగా ఉంటే మరికొన్నింటిపై ప్రతికూలంగా ఉంటుంది. అనుకూలంగా ఉన్న రాశులవారి కెరీర్ ఉన్నతస్థాయికి చేరుకుంటుంది. అంతేకాకుండా ధన సంపదలు లభిస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు మిథున రాశిలో ప్రవేశిస్తున్నాడు. అదే సమయానికి శని కుంభరాశిలో ఉండటంతో నవ పంచమ రాజయోగం (అభివృద్ధి యోగం)ఏర్పడుతోంది. ఈ రెండు గ్రహాల స్నేహం ప్రభావం 3 రాశులపై ప్రత్యేకంగా ఉండబోతోంది.
ధనస్సు రాశి :వీరి స్థితిని నవ పంచమ రాజయోగం మార్చేయబోతోంది. వివాహితులకు బాగుంటుంది. ఆస్తి లేదంటే వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. విదేశాల్లో వ్యాపారం చేసేవారికి ధన లాభం ఉంటుంది. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు కలుగుతాయి. వ్యాపారస్తులు లాభాలను ఆర్జించడంతోపాటు ఆర్థికంగా మంచి స్థితిలో ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది.

తుల రాశి :ఈ రాశికి అధిపతి శుక్రుడు. కుండలిలో పంచమపాదంలో శని, నవమ పాదంలో శుక్రుడు ఉండటం వల్ల అన్నీ శుభాలే జరుగుతాయి. అదే సమయంలో అదృష్టం తోడుగా ఉండటంతో ఆర్ధికంగా మంచి స్థితిలో ఉంటారు. శని త్రికోణ రాజయోగం వల్ల ఉద్యోగస్తులకు ఆరోగ్యం మెరుగుపడి ప్రమోషన్ వస్తుంది. ఆధ్యాత్మిక యోగం చేయాల్సి ఉంటుంది.
కుంభ రాశి :రాజయోగం ఈ రాశివారికి అనుకూలంగా ఉంటుంది. బుద్ధి, ఉన్నతస్థితి కారణంగా ఏర్పడే ఈయోగం కుంభరాశివారికి ఊహించని ప్రయోజనాలను కలిగిస్తోంది. షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టేవారికి కలిసివస్తుంది. పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. పనిచేసేచోట ప్రయోజనాలుంటాయి. పాత పెట్టుబడులవల్ల లాభం కలుగుతుంది.












Click it and Unblock the Notifications