నేడే శక్తివంతమైన నవపంచమ రాజయోగం... ఈ రాశులవారు నక్కతోక తొక్కినట్టే!.
సెప్టెంబర్ 1, 2026న శుభ గ్రహంగా భావించే గురువు, కర్మ ప్రదాత అయిన శని గ్రహాలు నవ పంచమ స్థానాలలో నిలవడంతో నవపంచమ రాజయోగం ఏర్పడనుంది. ఈ శుభ యోగం కొన్ని రాశుల వారికి అదృష్టం, సంపద, కెరీర్‌లో విజయం తీసుకురాగలదు. మరి నేటి నుండి నవ పంచమ రాజయోగంతో అదృష్టం పొందే ఆ రాశులను గురించి తెలుసుకుందాం.
నవ పంచమ రాజయోగం నేడే
శని ప్రస్తుతం మీన రాశిలో వక్ర సంచారం చేస్తూ ఉండగా, గురు తన స్వరాశి అయిన కర్కాటకంలో ఉన్నాడు. సెప్టెంబర్ 1న ఉదయం 3:39 గంటలకు ఈ రెండు గ్రహాలు 120 డిగ్రీల దూరంలో నవ, పంచమ స్థానాలలో ఉండటం కారణంగా నవపంచమ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం 5వ భావం బుద్ధి, పిల్లలు, పెట్టుబడులను, 9వ భావం అదృష్టం, ఉన్నత విద్య, విదేశీ ప్రయాణంను ప్రభావితం చేస్తుంది.

మేష రాశి: నవ పంచమ రాజయోగం కారణంగా మేషరాశి జాతకులకు సామాజిక గౌరవం, ఖ్యాతి పెరుగుతుంది. కోల్పోయిన డబ్బు తిరిగి రావచ్చు. ఉద్యోగంలో పదోన్నతి కలుగుతుంది. జీతం పెరుగుదల, ప్రయాణ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
వృషభ రాశి: వృషభ రాశి జాతకుల ఆర్థిక స్థితి మెరుగవుతుంది. ఆదాయం పెరుగుతుంది. మీకు నచ్చిన చోటికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి.
మిథున రాశి: మిథున రాశి జాతకులకు కొత్త పదవి, అదృష్టం మద్దతు ఇస్తాయి. సామాజిక గౌరవం పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో అవకాశాలు వస్తాయి, అసంపూర్ణ పనులు పూర్తి చేస్తారు. ఇది వీరికి మంచి ఫలితాలను ఇచ్చే సమయం.
తులా రాశి: తులారాశి వారికి నవ పంచమ రాజయోగం కారణంగా సుఖసంతోషాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. కోల్పోయిన డబ్బు తిరిగి రావచ్చు. ఆదాయం పెరిగే మార్గాలు కనిపిస్తాయి.
మకర రాశి: మకర రాశి జాతకులకు నేటినుండి ఈ యోగం వల్ల కెరీర్, ఆర్థిక రంగాల్లో మంచి ఫలితాలు రావచ్చు. ఈ నవపంచమ రాజయోగం ప్రభావంతో పై వీరికి స్వర్ణయుగం ప్రారంభమవుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.













Click it and Unblock the Notifications