• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మానవ శరీరంలో నాడీ పాత్ర ? ఇంతకీ నాడీ ఏం చేస్తోంది

|

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు. హైదరాబాద్ - ఫోన్ : 9440611151

మన మొత్తం శరీరాన్ని నియంత్రించేది మెదడు .మెదడుకు తన సందేశాలను నాడీ మండలం ద్వారానే ఇతర అవయవాలకు పంపిస్తుంది .ఇతర అవయావాల సందేశాలను మోసుకుని చేరవేసేది నాడీ మండలమే. నాడీ మండలానికి ,మెదడునకు సన్నిహిత సంబంధం ఉంది.

ఈ ప్రపంచంలో ఎన్ని విచిత్రాలు ఉన్నాయో! అంతకు మించి మనిషి శరీరంలో అనేక విశేషాలు ఉన్నాయి. భగవంతుడు తన శక్తినంతటిని మనిషి శరీరం నందు వెన్నెముక క్రింద భాగంలో వెంట్రుక వలె ఉండు కుండలినిలో దాచాడు. మీరు మీ రెండు చూపుడు వేళ్ళని రెండు చెవులలో పెట్టుకుని ప్రశాంతంగా లోపలి శబ్దాన్ని వినండి. అదే శబ్దం మీకు ప్రవాహంలా వినిపిస్తుంది.అదే నాడీ స్పందన.అందులోని రక్త ప్రసరణ , శక్తి ఆ శబ్దం చేయును .

ఒక మనిషి ఒక మంత్రమును తీసుకుని శ్రద్ధగా అదే పనిగా ఉపాసిస్తే 41 రోజులలో శక్తివంతుడు కావొచ్చు.

శరీరం నందలి మూలాధారంనకు మీదుగా నాభి స్థానమునకు మధ్యన మూల కందము నందు "సుషుమ్న" అను నాడి ఒకటి ఉంటుంది. ఇళా , పింగళ నాడులు ఈ సుషుమ్న నాడిని చుట్టుకొని ఉంటాయి.

మనుషుల దేహములో సూక్ష్మ, స్థూల నాడులు 3 కోట్ల 50 లక్షలకు పైగా..... ఉన్నవి.ఈ నాడులు ములాధారమును ఆశ్రయించి కొన్ని ఊర్ధ్వ (పైన ) భాగము కొన్ని అధో భాగము నందు వ్యాపించి ఉంటాయి . మరియు పై నాడులను ఆశ్రయించి 3 కోట్ల 50 లక్షల పై చిలుకు రోమాలు ఉన్నవి.ఈ రోమలే నాడులకు ముఖాలుగా చెప్పబడును.

nervous system that transmits other episodes of messages

వీటినుండే చెమట స్రవించ బడును. ఒక సూక్ష్మ వాయువు కలదు. అది ప్రాణాది వాయువుల ద్వారా దేహమంతటికి వ్యాపిస్తుంది. ఈ నాడులలో 72 వేల నాడులు వాయు సంచార యోగ్యమై ఉండును. నదులు తమ జలములతో సముద్రాన్ని ఏ విధంగా సమృద్ది పరుచునో అదేవిధంగా నాడులు మనిషి తీసుకున్న అన్నపానాదులు, రసము వలన దేహమును వృద్ది అగు చున్నవి. అందులో 1072 నాడులు స్థూల నాడులుగా ఉన్నవి.

ఈ నాడులలో శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాత్మక , పంచేంద్రియ , గుణ గ్రాహకంబులు అగు నాడులే ఎంతో శ్రేష్టముగా ఉండును. ఈ అయిదు నాడులు ములాధారమును ఆశ్రయించి నాభి చక్రమున ప్రవేశించి ఉన్నవి.పైన చెప్పిన స్థూల నాడులను ఆశ్రయించి నిర్మలమైన 700 ప్రధాన నాడులు ,సూక్ష్మ రంద్రాలతో కూడి యుండును .

ఇవి ప్రతి దినం మనిషి తినే వివిధ అన్నపానీయాల రసం గ్రహింస్తూ శరీరాన్ని వృద్ది చేయును .

పైన చెప్పిన నాడులలో ఇడా , పింగళ , సుషుమ్న , సరస్వతి, వారుణి, పూషా , హస్తి జిహ్వ , యశస్విని , విశ్వోదరి, కుహు, శంకిని, పయస్విని, అలమ్బుస , గాంధారి అను ఈ 14 నాడులు ముఖ్యమైనవి.

ఈ పదునాలుగు నాడులలో ఇడా నాడి మొదలు వారుణి నాడి వరకు గల పది నాడులు.... ప్రాణాధి వాయు వాహినులు అయి ఉండును. ఇందువలన ఇవి ప్రధాన నాడులుగా గుర్తించబడుతున్నవి. ఇడా , పింగళ , సుషుమ్న అను ఈ 3 నాడులు శరీరంలో పై భాగమునకు పోవును .

గాంధారి, హస్తిజిహ్వ, అను రెండు నాడులు చేతులు మొదలయినవి చాచుటకు , ముడుచుటకు ఉపయుక్తములుగా ఉండును. ఆలంబుస, యశస్విని అను రెండు నాడులు దక్షిణాంగమున ఉండును. కుహు, శంఖిణి, అను ఈ రెండు నాడులు వామభాగంబున వ్యాపించి ఉండును.

మద్య భాగంలో ఉండే ఒక నాడి నాడి సమస్త కార్యాలను చేయును. ఎడమ ముక్కు రంద్రంలో ఇడా , కుడి ముక్కు రంద్రంలో పింగళ , బ్రహ్మ రంధ్రములో సుషుమ్న ,ఎడమ కన్నులో గాంధారి, కుడి కన్నులో హస్తిజిహ్వ , కుడి చెవి పూషా , ఎడమ చెవి యందు యశస్విని, నాలుకయందు ఆలంబుస , శిశ్న మూలంలో కుహు నాడి, తల మీద శంఖిని . ఇలా పది నాడులు ఆశ్రయించి ఉండును.

ప్రాణము, అపానము, సమానము, ఉదానము, వ్యానము, నాగము, కూర్మము, క్రుకరము , దేవ దత్తము, ధనుంజయము అను ఈ పది వాయువులు దేహమందలి అన్ని నాడులలో సంచరించును. ఇందులో ధనంజయ వాయువు అనునది మనిషి మరణించాక శరీరం ఉబ్బుటకు కారణం అగును.

చెవుల యందు వ్యాపించి ఉండే నాడులు శబ్ద గ్రాహకములు, కన్నుల యందు ఉండేవి రూప గ్రాహకములు, ముక్కు యందు ఉండేవి కంద గ్రాహకములు,నాలుక యందు ఉండేవి రస గ్రాహకములు, చర్మం యందు ఉండేవి స్పర్శ గ్రాహకములు, హృదయం, ముఖము నందు ఉండునవి శబ్దోచ్చారణముకు ఉపయోగ పడేవిగా ఉండును. పురీతతి అను నాడి యందు మనస్సు లీనం అయినపుడు మనిషికి నిద్ర వస్తుంది.

నాడి పరిజ్ఞానము - నాడిని పట్టుకొని రోగ నిర్ణయం చేయు విధానం:-

శుక్లశోణిత సంయోగముచే జనించిన దేహము నందు చర్మము , రక్తము , మాంసం కొవ్వు , ఎముకలు , నరములు గూడుకట్టుకుని ఉన్నవి . మరియు మానవశరీరం నందు 70 వేల నరములు ఉన్నవని అని శరీరశాస్త్రం తెలుపుతుంది. ఈ నరములు శరీరములో గల లక్షణాలను వాటి చలనములు వలన నిరూపించుచున్నవి ఈ నరముల చలనములే నాడీ పరిజ్ఞానముకు మూలాధారములు అయి ఉన్నవి.

శరీరమున గల నాడులు 5 నామములతో పిలవబడుచున్నవి . అవి

* భూతనాడి .

* వాతనాడి .

* పిత్తనాడి .

* శ్లేష్మనాడి .

* గురునాడి .

ఆహార విహారాదుల యందు మానవుడు సరైన మార్గమము అనుసరించక పోవడం వలననే రోగములు ఉద్భవించుచున్నవి. ఈ నాడుల యొక్క మూలము వలనే రోగ నిర్ధారణ చేయడం జరుగుతుంది .

ఏ రోగంనందైనను వాత,పిత్త,శ్లేష్మములు ప్రకోపించి రోగ హేతువులు అగుచున్నవి. రోగి యొక్క మణికట్టు నందు 3 అంగుళాల ప్రదేశము నందు నాడి చలించును. నాడి వైద్యులు పురుషులకు కుడిచేతి మణికట్టు , ఆడవారికి ఎడమచేతి మణికట్టు నందు పరీక్షిస్తారు. బొటన వ్రేలి నందు భూతనాడి , చూపుడువ్రేలు నందు వాతనాడి , మధ్యవ్రేలు నందు పిత్తనాడి ,ఉంగరపు వ్రేలు నందు శ్లేష్మనాడి , చిటికిన వ్రేలు నందు గురునాడి చలించును.

వాత,పిత్త,శ్లేష్మ నాడులు యే రోగ నిర్ణయముకు ఆధార భూతములు .

వాతనాడి పామునడక వలే మెలికలుగా జలగ గమనము వలే సంచరించుచుండును. పిత్తనాడి నెమలి వలే హంసవలే చలించుచుండును. శ్లేష్మనాడి ఊరపిచ్చుక వలే , పావురమువలే ,కోడివలే నడుచుచుండును. వాతనాడికి బ్రహ్మయు , పిత్తనాడికి విష్ణువుయు , శ్లేష్మనాడికి పరమేశ్వరుడు అధి దేవతలు .

ఒక్కోసారి రోగ లక్షణములును బట్టికూడా వైద్యం చేస్తారు. మనిషి శరీరం నందు వేడిమి అధికం అయినకొలది చురుకుదనం అధికరించును .అదే శరీరం చల్లదనం అయినచో నాడి చురుకుదనం క్షీణించును. నాడి యొక్క గమనం అధికం అవుతూ వృద్ధిచెందినచో గుండె యొక్క పనితీరును చేడుపెస్తున్నది అని గ్రహించవలెను.

నాడీ పరీక్ష వలన ,వాత ,పిత్త కఫలచే రోగములు అనేవి ఏ స్థాయిలో ఉన్నాయి అనేది నాడీ పరీక్ష ద్వారానే తెలుస్తుంది.మానవుని నాడీ వ్యవస్థపై స్థితిని బట్టి ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.అందుకే సంపూర్ణ ఆరోగ్యం కోసం యోగాసనాలు చేస్తూ ,ఆహార నియమాలు పాటిస్తే బతికినన్నాల్లు ఆరోగ్యంగా ఉండడానికి సాధ్యపడుతుంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Our whole body is controlled by the brain .That sends messages to the other organs through the neurotransmitter .One is the nervous system that transmits other episodes of messages. For the nervous system, the brain has a close relationship.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more