2024లో ఈ రాశులవారిపై లక్ష్మీదేవి అనుగ్రహం

కొత్త సంవత్సరంలో అనేక గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. కొందరి జాతకాలు, గ్రహాల స్థితిగతులు మారి లక్ష్మీదేవి అనుగ్రహం లభించబోతోంది. ఇప్పటివరకు ఆర్థిక ఇబ్బందులవల్ల సమస్యలను ఎదుర్కొన్నవారికి ఉపశమనం లభించబోతోంది. అంతేకాదు.. అదృష్టం కూడా రెట్టింపు అవబోతోంది. 2024లో ఏయే రాశులవారు అదృష్ట జాతకులు కాబోతున్నారో తెలుసుకుందాం.

మేషరాశి: 2024 ఏడాది వీరికి ఎంతో అనుకూలంగా ఉంది. వ్యాపారాలు చేసేవారు పెట్టుబడులను భారీగా పెడతారు. సోదరుల నుంచి మద్దతు లభించి ఏ పనినైనా సులువుగా చేసేస్తారు. ఇంట్లో శుభకార్యాలున్నాయి. ఉద్యోగులకు వారు చేస్తున్న ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారే అవకాశాలు అధికంగా ఉన్నాయి.

New Year 2024 Money Horoscope

మిథున రాశి: ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తద్వారా ఎటువంటి పనినైనా సులువుగా చేసేస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలోపేతమవుతుంది. కొత్త ఏడాదిలో ఉద్యోగస్తులు వారి కార్యాలయాలను మార్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారుల నుంచి మద్దతు లభించి ఊహించనిరీతిలో లాభాలను పొందనున్నారు.

కన్యారాశి : ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. ఇంటితోపాటు వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. వైవాహిక జీవితం సంతోషంగా గడుస్తుంది. ఉద్యోగులకు వారి వారి కార్యాలయాల్లో ఊహించనిరీతిలో మార్పలు వస్తాయి. కుటుంబ జీవితం గడుపుతున్నవారికి సంతోషం రెట్టింపవుతుంది.

ధనుస్సు రాశి: కొత్త సంవత్సరంలో వీరికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఆర్థికంగా లాభాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. వారితో కలిసి విహార యాత్రకు లేదంటే తీర్థయాత్రకు వెళతారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+