జూన్ 18వ తేదీ నిర్జల ఏకాదశి.. వీరికి అఖండ ధనయోగం

మనకు సంవత్సరానికి 24 ఏకాదశి తిథులు వస్తాయి. నెలకు రెండుసార్లు ఏకాదశి తిథి వస్తుంది. ఏకాదశి తిథి అనేది శ్రీ మహవిష్ణువుకు ఎంతో ఇష్టం. ఆ రోజున విష్ణువుతో పాటు, శ్రీ మహాలక్ష్మీ దేవిని భక్తితో పూజిస్తే మంచి ధనలాభం కలుగుతుంది. నిర్జల ఏకాదశి రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి తలస్నానం చేయాలి. తర్వాత పూజ గదిని శుభ్రం చేసుకొని మార్కెట్ లో దొరికే ప్రత్యేకమైన పూలు, పండ్లు తీసుకువచ్చి భగవంతుడికి నివేదించాలి. శ్రీ మహావిష్ణువును అలంకార ప్రియుడిగా రుషులు వర్ణించారు. అందుకే ప్రత్యేకమైన పూలతో బాగా అలంకరించాలి.

అన్నదానం, వస్త్రదానం చేయాలి
ఏకాదశి తిథి రోజు తెల్లని పూలు, తులసి దళాలతో మాలలు చేసి శ్రీ మహవిష్ణువుకు సమర్పించుకోవాలి. ఆరోజు ఉపవాసం ఉంటే మంచిది. చేయగలిగినవారు చేయవచ్చు. అలా ఉండలేనివారు ఏక భుక్త వ్రతం చేయవచ్చని వేద పండితులు సూచిస్తున్నారు. ఆరోజు ఏ వ్రతం చేసినా, ఎటువంటి దానం చేసినా వందరెట్లు ఎక్కువ లాభాలను తెచ్చిపెడుతుంది. ఈ విషయం పురాణాల్లో కూడా చెప్పారు. అందుకే నిర్జల ఏకాదశి రోజు పేదలకు అన్నదానంతోపాటు వస్త్రదానం చేయాలి. తమకు శక్తి ఉన్నమేరకు పేదల పెళ్లికి సాయం చేయాలి.

nirajala ekadashi astrological remedies for get huge money and heavy profits

జీవితం అద్భుతంగా ఉంటుంది
పైన చెప్పివన్నీ పాటిస్తే శ్రీ మహాలక్ష్మీ దేవీ అనుగ్రహంతో అఖండ ధనయోగంతో పాటు, పెళ్లి కానివారికి శీఘ్రంగా పెళ్లి కుదురుతుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. యువతకు ఇటీవలికాలంలో పెళ్లి కుదరడం అంటే భగీరథ ప్రయత్నంలా మారింది. ఈ పరిహారాలను పాటిస్తే మంచిది. ఏకాదశి రోజున శ్రీ సత్యనారాయణ వ్రతాన్ని భక్తి, శ్రద్ధలతో చేస్తే జీవితంలో ఏ విషయాల్లోను తక్కువగా జరగదు. ఊహించని రీతిలో అద్బుతంగా ఉంటుంది. రావి చెట్టు కింద నెయ్యితో దీపారాధన చేయాలి. నల్ల చీమలకు పంచదార లేదంటే బెల్లంను ఆహారంగా పెట్టాలి. పేదలకు పండ్లు, మిఠాయిలు పంచిపెట్టాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+