ఆగస్ట్ లో ఈ రాశులవారు లక్కీ భాస్కర్‌లు అవుతున్నారు.. మీరున్నారా!
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తూ ఉంటాయి. నక్షత్రాలను కూడా మారుతూ ఉంటాయి. ఇలా గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేసేటప్పుడు వివిధ గ్రహాలతో సంయోగం జరిపి కొన్ని శుభయోగాలను కొన్ని అశుభయోగాలను ఏర్పరుస్తాయి.
శని, గురు గ్రహాల సంయోగం
ప్రస్తుతం నేడు జూలై 31వ తేదీన గురువు, శని గ్రహాలు ఒకదానికొకటి 100డిగ్రీల దూరంలో ఉండడం వల్ల అరుదైనయోగం ఏర్పడింది. వంద డిగ్రీల దూరంలో ఉన్న శని, గురువు విశిష్ట కలయిక వల్ల ఏర్పడిన ఈ యోగంతో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి రాబోతుంది. నేటినుండి శని, గురువు కారణంగా అదృష్టవంతులుగా మారుతున్న ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

వృషభ రాశి
శనీశ్వరుడు, బృహస్పతి సంయోగం కారణంగా వృషభరాశి జాతకులకు కలిసి వస్తుంది. ఈ సమయంలో శుభ ఫలితాలను చూస్తారు. ఎప్పటినుంచో అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి అవుతాయి. వీరికి ఈ సమయంలో ఆర్థికంగా లాభాలు కలుగుతాయి. సంతోషకరమైన కుటుంబ జీవితం ఉంటుంది. ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. విద్యార్థులకు మంచి సమయం. ఏ పని చేసిన విజయం సాధిస్తారు. వృషభరాశి వారికి నేటి నుండి అన్నివిధాల లాభదాయకంగా ఉంటుంది.
మకర రాశి
మకర రాశి వారికి శనీశ్వరుడు, బృహస్పతి సంయోగం సానుకూల ఫలితాలను తెస్తుంది. ఈ సమయంలో వీరు ఏ పని చేసిన సక్సెస్ ఫుల్ గా చేస్తారు. మకర రాశి వారు పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. వీరి ఆరోగ్యం బాగుపడుతుంది. ఎప్పటినుంచో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ప్రేమ జీవితం బాగుంటుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. జీవితంలో ప్రశాంతత చేకూరుతుంది.
కుంభరాశి
కుంభ రాశి జాతకులకు శనీశ్వరుడు, బృహస్పతి సంయోగం అదృష్టాన్ని తెస్తుంది. ఈ సమయంలో కుంభ రాశి వారు కెరీర్లో విజయాలు సాధిస్తారు. ఆర్థికంగా ఉన్నత స్థితిని పొందుతారు. కుంభ రాశి జాతకులకు ఇప్పటినుంచి భవిష్యత్తు బాగుంటుంది. తాత ముత్తాతల నుండి ఆస్తులు వచ్చే అవకాశం ఉంది. ఆదాయం పురోగమిస్తుంది. ఏ పని చేసినా కుంభ రాశి వారికి ఇప్పటినుంచి తిరిగే ఉండదు.
Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications