2023లో ఈ రాశులలో రాహువు సంచారం... జాగ్రత్త అవసరం.. ఇదే కష్టాల కాలం!!
2023 సంవత్సరం చాలా రాశుల వారికి శుభాలను , కొన్ని రాశుల వారిపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాలను కూడా సూచించింది. ఈసారి చాలా రాశులపై శ్రేష్టమైన గురు ప్రభావం ఉంటే, కొన్ని రాశులపై రాహువు ప్రభావం తీవ్రంగా కనిపించింది. కొందరి జీవితాలలో రాహువు ఉండే స్థానం శుభాలను, కొందరి జీవితాలలో రాహువు ఉండే స్థానం ఆశుభాలను కలిగిస్తుంది. 2023 లో రాహువు సంచరించే కొన్ని రాశుల వారికి అనుకోని ఇబ్బందులు వచ్చే ప్రభావం ఉంటుందని, వారు ప్రతికూల ఫలితాలతో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు అని కూడా చెప్పబడింది. ఇక ఆ అసలు వివరాల్లోకి వెళితే

మేషరాశిలో రాహువు సంచారం... జాగ్రత్త అవసరం
2023 సంవత్సరం మేష రాశి వారికి శుభప్రదమైన సంవత్సరంగా, బాగా కలిసొచ్చే సంవత్సరంగా చెప్పబడింది. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ధనయోగం ఉందని కూడా చెప్పబడింది. అయితే 2023 లో మేష రాశి జాతకులకు రాహువు సంచారం ప్రభావం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మేషరాశి జాతకులకు అనవసరపు ఖర్చులు పెరుగుతాయని, ఆర్థిక, శారీరక, మానసిక సమస్యలతో పాటు కుటుంబ సమస్యలు కూడా పెరుగుతాయని, వారంతా అప్రమత్తంగా ఉండాలని సూచించబడింది. 2023 సంవత్సరం మొత్తంగా మేష రాశి వారికి శుభఫలితాలను ఇచ్చినప్పటికీ రాహువు సంచార ప్రభావంతో కుటుంబ సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంటుందని, ఏ పని చేసిన అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు.

కన్యా రాశి జాతకులపై రాహువు ప్రభావం
ఇక 2023లో కన్య రాశిలో రాహువు ప్రభావం వల్ల, ఆ రాశి జాతకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. చిన్న చిన్న పనుల కోసం కూడా వారు పెద్దగా కష్టపడాల్సి వస్తుంది. ఇక వారి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది. రాహువు ప్రభావం వల్ల కన్యారాశి జాతకులు మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించబడింది.

రాహువు ప్రభావం మకర రాశి వారిపై ఇలా ..
అంతేకాదు రాహువు సంచారం వల్ల మకర రాశి వారికి కూడా అనవసరపు ఖర్చులు పెరుగుతాయని, ఖర్చుల విషయంలో మకర రాశి జాతకులు జాగ్రత్త గా ఉండాలని సూచించబడింది. వ్యాపారంలోనూ, ఉద్యోగంలోనూ సమస్యలు ఉండే అవకాశం ఉందని, వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పబడింది. మకర రాశి జాతకులు ఈ సమయాల్లో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలని, లేదంటే హాని జరిగే అవకాశం ఉందని సూచించబడింది. మకర రాశి జాతకులకు కుటుంబ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇంట్లో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంటుంది. వివాహితులకు వారి జీవిత భాగస్వామితో గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరమైన సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.

వృషభ రాశిపై రాహువు ఎఫెక్ట్ ఇలా
ఇక 2023లో వృషభ రాశి జాతకులకు రాహువు ప్రభావంతో అనేక ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. వృషభ రాశి వారు రాహువు కారణంగా మానసిక ఒత్తిడిని ఎదుర్కోవలసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉండటంతో పాటు, చేస్తున్న పని చెడిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కనుక వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇదని సూచించబడింది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications