రథసప్తమికి సర్వం సిద్ధం.. తిరుమలలో ఘనంగా ఏర్పాట్లు.. వాహన సేవల షెడ్యూల్..
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్న వాక్యం ప్రకారం ఆరోగ్యం కొరకు ఈ మాసమంతా ఆదిత్య హృదయం పారాయణ చేయాలి. కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామికి ఈ రధసప్తమి సందర్భంగా విశేషమైన పూజలు, కార్యక్రమాలు జరుగుతాయి. భక్తుల రద్దీకి తగ్గట్టు ఏర్పాట్లు చేశారు.

ఒకే రోజు ఏడు వాహన సేవలు
తిరుమల శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి 1న శనివారం రథసప్తమి పర్వదినం నిర్వహణకు సర్వం సిద్ధమైంది. శ్రీవారి ఆలయంతోపాటు అన్నప్రసాదం, నిఘా మరియు భద్రత, ఉద్యానవన తదితర విభాగాలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. రథ సప్తమి వేడుకల్లో భాగంగా ఒకే రోజు ఏడు వాహనాలు సేవలను నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు ప్లాన్ రూపొందించారు.
* భక్తులు చలికి, ఎండకు, వర్షానికి ఇబ్బందులు పడకుండా గ్యాలరీల్లో వేచి ఉండేందుకు వీలుగా తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేశారు.
* భక్తులకు ఉదయం నుండి రాత్రి వరకు టి, కాఫి, పాలు, తాగునీరు, మజ్జిగ, అల్పాహారం, అన్నప్రసాదాలు నిరంతరాయంగా పంపిణీ చేయనున్నారు.

వాహనసేవల సమయాలు
శ్రీవారి ఆలయంలో తెల్లవారుజామున కైంకర్యాలు పూర్తయిన తరువాత ఉదయం 4.30 గంటలకు శ్రీమలయప్ప స్వామివారు ఆలయం నుండి వాహనమండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ విశేష సమర్పణ చేపడతారు.
ఉదయం 5.30 నుండి 8 గంటల వరకు - సూర్యప్రభ వాహనం
ఉదయం 9 నుండి 10 గంటల వరకు - చిన్నశేషవాహనం
ఉదయం 11 నుండి 12 గంటల వరకు - గరుడ వాహనం
మధ్యాహ్నం 1 నుండి 2 గంటల వరకు - హనుమంత వాహనం
మధ్యాహ్నం 2 నుండి 3 గంటల వరకు - చక్రస్నానం
సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు - కల్పవృక్ష వాహనం
సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు - సర్వభూపాల వాహనం
రాత్రి 8 నుండి 9 గంటల వరకు - చంద్రప్రభ వాహనం

భక్తులకు ఫుడ్ కౌంటర్లు
* తిరుమల క్యూలైన్ గ్యాలరీలలో ఉన్న భక్తులకు అన్నప్రసాద వితరణకు ఫుడ్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు.
భక్తులకు మరింత మేరుగైన సేవలందించేందుకు అదనపు సిబ్బందికి డెప్యుటేషన్ విధులు కేటాయిస్తున్నట్టు తెలియజేశారు.
ప్రతి గ్యాలరీలో శ్రీవారి సేవకులు, ఆరోగ్య సిబ్బంది ఉంటారు.
భక్తులు వాహనసేవలను తిలకించేందుకు వీలుగా ఎల్ఇడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications