23న శని అమావాస్య.. ఇలా చేస్తే ఊహించని శుభాలు, ఆర్థిక లాభాలు

మనకు చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదించేవాడు శనిదేవుడు. ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారేందుకు రెండున్నర సంవత్సరాల సమయం తీసుకుంటారు. ఆ సమయంలో కొన్ని రాశులవారికి సాడే సతి ప్రభావం ఉంటుంది. శని అమావాస్య వల్ల వాటిని పోగొట్టుకోవచ్చు. ఈ నెల 22వ తేదీ ఉదయం 11.00 గంటలకు శని అమావాస్య ప్రారంభమై 23వ తేదీ ఉదయం 11.00 గంటలకు ముగుస్తోంది.

ఆ సమయంలో శనిని ప్రత్యేకంగా పూజించడవల్ల అనేక మంచి ఫలితాలను పొందుతారు. అమావాస్య తిథి అంటేనే చాలా మంచిది. భాద్రపద మాసంలో దీనికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది. పుణ్యనదుల్లో స్నానం ఆచరించి పెద్దలకు తర్పణం వదలడంవల్ల అనేక శుభాలను పొందుతారు.ఆగస్టు 23వ తేదీ శనివారం వచ్చింది. దీంతో దీన్ని అమావాస్య తిథి అంటారు.

Saturn Amavasya on the 23rd august If you do this you will get unexpected auspiciousness and financial gains

సకల సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది
జ్యోతిష్య పండితుల అభిప్రాయం ప్రకారం శని అమావాస్య రోజు శనిదేవుడిని పూజిస్తే పలు సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఆర్థిక ఇబ్బందులకు శాశ్వతంగా విముక్తి కలుగుతుంది. అంతేకాకుండా పూర్వీకుల నుంచి ఆశీస్సులు లభించి ప్రతి పనిలోను విజయం సాధిస్తారు. ఏలిన నాటి శనితో బాధపడేవారు ప్రత్యేకమైన పూజలు నిర్వహించాలి. ఆరోజు దానం చేస్తే అనేక రెట్ల పుణ్యఫలం లభిస్తుంది. మన పూర్వీకుల ఆశీస్సులు సంపూర్ణంగా లభించాలంటే ఇంట్లో దక్షిణ దిశలో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడంవల్ల వారి ఆత్మ శాంతించడంతోపాటు సంతోషం పెరుగుతుంది. పై లోకాల్లో ఆనందంగా ఉంటారు.

ఇనుప వస్తువులు దానం చేస్తే మంచిది
నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయడంతోపాటు శనిని పూజించాలి.'శం శనైశ్చరాయ నమః' అనే మంత్రాన్ని 108 సార్లు జపించడంవల్ల మంచి ఫలితాలు కలిగి సంతోషంగా ఉంటారు. ఇనుప వస్తువులు, చెప్పులు, నల్ల నువ్వులు, మినప్పప్పు, బెల్లం, పిండి కలిపి తయారుచేసిన పదార్థాలను పంచడంవల్ల కూడా శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు.. లక్ష్మీదేవి సంతోషించి ధనలాభాన్నిస్తుంది. శనిని నువ్వుల నూనెతో అభిషేకం చేయడంవల్ల శుభం కలుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+