శని కుబేరయోగంతో ఈ రాశులవారికి సంపదల వర్షం!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం అన్ని రాశుల వారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తాయి అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే గ్రహాలు అన్నింటిలోకి కీలకమైన గ్రహంగా భావించే శని దేవుడు తమ రాశిని మార్చుకుంటూ సంచారం సాగిస్తాడు. శని దేవుడు న్యాయానికి ప్రతీక, అంతేకాదు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా వ్యవహరించే వారి పట్ల ఆయన కటాక్షం తప్పనిసరిగా ఉంటుంది.
శని కుబేరయోగం
త్వరలో శని దేవుడు మీనరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. మార్చి 29వ తేదీన శనివారం రోజు శనిదేవుడు మీనరాశిలోకి సంచారం చేసే సమయంలో కుబేర యోగం పడుతుంది. ఈ శని కుబేర యోగం కారణంగా లబ్ధిని పొందే రాశులు ఏమిటి? అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి శని దేవుడి కటాక్షం వలన కలిసి వస్తుంది. ఈ సమయంలో కర్కాటక రాశి వారికి పనిలో అపారమైన విజయం లభిస్తుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు భారీ లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు .వైవాహిక జీవితం బాగుంటుంది. ఉద్యోగాలు చేసే కర్కాటక రాశి వారికి కలిసివస్తుంది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి శని దేవుడి రాశి మార్పు ఆర్థిక లబ్ధిని చేకూరుస్తుంది. నూతన ఇల్లు లేదా వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఈ సమయంలో పుష్కలంగా ఉంటుంది. ధనుస్సు రాశి వారు ఈ సమయంలో రాజభోగాలను అనుభవిస్తారు. అనేక సంవత్సరాలుగా ధనుస్సు రాశి వారు చేసిన కృషి ఫలిస్తుంది. విద్యార్థులకు ఇది మంచి సమయం. ఆర్ధిక ప్రయోజనాలు కలిగే కాలం.
కన్య రాశి
కన్యా రాశి వారికి శనీశ్వరుడి అనుగ్రహం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రాశుల వారికి నూతన ఆదాయ వనరులు పెరుగుతాయి. సమాజంలో కీర్తి, గౌరవం దక్కుతాయి. సొంతంగా వ్యాపారం చేసేవారు వ్యాపారాన్ని విస్తరించే అవకాశం ఉంది. ఈ సమయంలో కన్యా రాశి వారికి ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. మీరు ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది. ఇది శుభ సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications