శని చంద్రుల యుతితో ఇప్పుడు ఈ రాశులవారికి డబ్బుల వర్షం!
ఖగోళంలో గ్రహాల సంచారం ఎప్పుడూ ఆసక్తికర మార్పులకు దారితీస్తుంది. ఈ క్రమంలో జూలై 7, 8, 9 తేదీల్లో మీన రాశిలో శని, చంద్రుల కలయిక కొన్ని రాశులవారికి శుభ ఫలితాలను ఇస్తోంది. . ఈ కలయికపై శుభ గ్రహమైన గురుడి అనుకూల దృష్టి కూడా పడటంతో అత్యంత శక్తివంతమైన శుభ యోగంగ మారుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
ప్రత్యేక గ్రహాల అనుకూలత వల్ల కొన్ని రాశులవారికి అద్భుతమైన అదృష్టయోగం
నిలిచిపోయిన కార్యాలు పూర్తి కావడానికి, కొత్త ప్రణాళికలతో ముందడుగు వేయడానికి ఈ మూడు రోజులు ఎంతో అనుకూలమైన సమయం.ఈ ప్రత్యేక గ్రహాల అనుకూలత వల్ల కొన్ని రాశుల వారికి అద్భుతమైన అదృష్ట యోగం పడుతుంది. వృషభం, మిథునం, కర్కాటకం, వృశ్చికం, మకరం, మీన రాశులలో జన్మించిన వారు ఈ సమయంలో చక్కటి సానుకూల ఫలితాలు అందుకుంటారు

వృషభ, వృశ్చిక రాశుల వారికి ఆర్థికంగా లబ్ది
కెరీర్‌లో పురోగతి ఆశించే వారికి అయా రంగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. సుదీర్ఘ కాలంగా వేధిస్తున్న కోర్టు కేసులు, పెళ్లి ప్రయత్నాలు, బదిలీలు, ఆర్థిక వ్యవహారాల పరంగా వీరికి శ్రేయస్కరమైన వార్తలు అందుతాయి. ఈ విశేష గ్రహయోగం ప్రభావంతో వృషభ, వృశ్చిక రాశుల వారికి ఆర్థికంగా సమాజంలో ఉన్నత స్థానాలు లభిస్తాయి. సకాలంలో తీసుకునే తెలివైన నిర్ణయాల వల్ల వ్యాపార మరియు ఆర్థిక లావాదేవీలలో ఊహించని ప్రయోజనాలు చేకూరుతాయి.
మిధున, కర్కాటక రాశుల వారికి సంపదల వెల్లువ
మిథున, కర్కాటక రాశి వారు విదేశీ విద్యా, ఉద్యోగ అవకాశాలను విజయవంతంగా అందుకుంటారు. కార్యాలయాలలో పదోన్నతులతో పాటు ఆశించిన ప్రాంతాలకు బదిలీ వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. కుటుంబంలో దీర్ఘకాలిక ఆస్తి తగాదాలు పటాపంచలై మనశ్శాంతి లభిస్తుంది. మరోవైపు, మకర రాశి వారికి కాలం అన్ని విధాలా కలిసి రానుంది. వీరు పోటీ పరీక్షలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఆశించిన ప్రభుత్వ ఉద్యోగాలను అనుకూలంగా సాధిస్తారు.
మీనరాశి వారికి అన్ని విధాలా శుభాలు
ఇక మీన రాశి వారికి స్వరాశిలో ఏర్పడే ఈ కలయికపై గురుడి వీక్షణం తోడవడంతో ఏల్నాటి శని వల్ల కలిగే కష్టాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ఈ మూడు రోజుల వ్యవధిలో వీరు చేపట్టే ప్రతి నూతన ప్రయత్నం నూటికి నూరు శాతం ఘన విజయాన్ని అందిస్తుంది.
గమనిక: జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనిని oneindia telugu ధృవీకరించలేదు. జ్యోతిష్యం వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు కాబట్టి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.Read more at:













Click it and Unblock the Notifications