Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

100ఏళ్ల తర్వాత శని మంగళ యుతి.. ఏప్రిల్ లో ఈ రాశులకు డబ్బే డబ్బు!

వేద జ్యోతిషశాస్త్రంలో ఏప్రిల్ నెలకు చాలా విశేషమైన స్థానం ఉంది. ఏప్రిల్ మాసంలో చోటుచేసుకునే గ్రహసంచారాలు అన్ని రాశులవారి జీవితాల మీద ప్రభావాన్ని చూపిస్తాయి. ముఖ్యంగా కర్మదేవుడు, క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పబడే శనిదేవుడు ఏప్రిల్ రెండవ తేదీన ధైర్యానికి, బలానికి కారకుడైన కుజుడుతో సంయోగం చెందబోతున్నాడు. శని మంగళ యుతి సుమారు 100సంవత్సరాల తర్వాత జరుగుతున్న కారణంగా కొన్ని రాశులవారు అదృష్టాన్ని పొందబోతున్నారు. మరి ఆ అదృష్టరాశులు ఏమిటో తెలుసుకుందాం.

మేషరాశి

మేష రాశి వారికి శని కుజుడు కలయిక కారణంగా పనులలో విశేషమైన ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో విజయాలు సాధించే అవకాశం ఉంది. ఆర్థికంగా మెరుగైన లాభాలను చూస్తారు. నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. వివిధ మార్గాల ద్వారా ఆదాయం సమకూరుతుంది.

shani mangala yuti Saturn Mars Conjunction after 100 years gives these zodiac signs wealthy life

మిధున రాశి

శని కుజ గ్రహాల కలయిక కారణంగా మిధున రాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి. మిధున రాశి వారి శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. దీర్ఘకాలంగా చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులకు మంచి లాభాలు, ఉద్యోగులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సంతోషదాయకంగా ఉంటుంది. బంధువులతో మంచి సమయాన్ని గడుపుతారు.

సింహరాశి

శని కుజ గ్రహాల కలయిక కారణంగా సింహ రాశి జాతకులకు కలిసి వస్తుంది. సింహరాశిలో ఈ కలయిక అష్టమ స్థానంలో జరుగుతుంది. ఇది ఊహించని శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో సింహ రాశి వారికి మెరుగైన లాభాలు వస్తాయి. రావలసిన బకాయిలు తిరిగి పొందడానికి అవకాశం ఉంటుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి సమయం అనుకూలంగా ఉంటుంది.. తల్లిదండ్రుల మద్దతు లభిస్తుంది.

మేషరాశిలో శుక్ర సంచారం.. ఈ రాశులవారికి పండుగే!!
మేషరాశిలో శుక్ర సంచారం.. ఈ రాశులవారికి పండుగే!!

కుంభరాశి

శని మంగళ యుతి కారణంగా కుంభరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో కుంభ రాశి వారి ఆర్థిక స్థితి బలపడుతుంది. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయి. పూర్వీకుల ఆస్తుల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ సమయంలో శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి.

గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+