2024లో ఈ 5 రాశులపై శని ఆగ్రహం.. మీ రాశి లేదుగా

మరి కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో తమ భవిష్యత్తు తెలుసుకునేందుకు ఎంతోమంది ప్రయత్నిస్తుంటారు. ప్రధానంగా రాశిఫలాలపై శని గ్రహం ప్రభావం ఎలా ఉంటుందో అని కొందరు ఆందోళన చెందుతున్నారు. శని అనుగ్రహం అనేది కర్మలపై ఆధారపడి ఉంటుంది. కొత్త ఏడాదిలో జనవరి 17వ తేదీన శని కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. దీన్ని సాడే సతి అంటారు. దీని ప్రభావం ఏయే రాశులపై ఉంటుంది? నష్ట నివారణకు ఏం చేయాలో తెలుసుకుందాం.

2024లో శని సాడే సతి కారణంగా మకరం, కుంభం, మీనం వంటి రాశులపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఇది మూడు దశల్లో ఉంటుంది. మకరరాశికి 2024లో సాడే సతి మూడో దశ ప్రారంభమవుతుంది. మీనరాశిలో ఉన్న సాడే సతి 2024లోనూ కొనసాగుతుంది. కుంభరాశి శని సాడే సాతి రెండో దశను 2024లో ఎదుర్కొంటుంది. వచ్చే ఏడాది శనిగ్రహం కుంభరాశిలోకి ప్రవేశించడం వల్ల వృశ్చికం, కర్కాటక రాశులపై శని ధ్యాయ ప్రభావం రెండున్నరేళ్లపాటు ఉంటుంది. వృశ్చికం, కర్కాటక రాశివారు ప్రత్యేకించి డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. అబద్ధాలు చెప్పడం, మోసపూరిత ప్రవర్తన, దొంగతనం, మద్యం సేవించడం, జూదం, వ్యభిచారం తదితర వాటికి దూరంగా ఉండాలి.

Shani will be angry with these 5 signs

నష్ట నివారణ మార్గాలు : ప్రతి శనివారం ఉపవాసం చేస్తూ శనేశ్వరుడిని పూజించాలి. శని స్తోత్రాన్ని పఠించాలి. రోజూ చేయలేకపోతే కనీసం శనివారం తప్పక చేయాలి. శనిదేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు దశరథ మహారాజు మొదటిసారి శని స్తోత్రాన్ని పఠించాడని చెబుతుంటారు. ప్రతికూల ప్రభావాలను నివారించడానికి శనివారం శనేశ్వర ఆలయాన్ని దర్శించుకోవాలి. ఒక గిన్నెలో ఆవాల నూనె పోసి, అందులో మీ ప్రతిబింబం చూడాలి. ఆ తర్వాత ఆ నూనెను పేదవారికి దానం చేయాలి. శనిదేవునికి ఇష్టమైన షమ్మి చెట్టుకు ప్రతి శనివారం నీళ్లు పోసి, సాయంత్రం ఆవాల నూనెతో దీపం వెలిగించాలి.

* శని స్తోత్రం పఠనం
'శని కే బిజ్ మంత్రం ఓం షన్ శనైశ్చరై నామ్' అనే స్తోత్రాన్ని రోజుకు కనీసం మూడు సార్లు జపించాలి. ప్రతి మంగళవారం, శనివారం హనుమాన్ చాలీసా, శని చాలీసా పారాయణం చేయాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+