అరుదైన అమావాస్య- మిస్ చేసుకోవద్దు..!!
హిందూ ధర్మంలో ఆషాఢ అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున పవిత్ర నదులలో స్నానం చేయడం, పూజలు చేయడం, దానాలు చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ ఏడాది ఆషాఢ అమావాస్య జూన్ 25, బుధవారం నాడు వస్తుంది. ఈ సాయంత్రం 6:59 నిమిషాలకు ఆమావాస్య తిథి ఆరంభమౌతుంది. బుధవారం సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది.
ఈ రోజున విధివిధానంగా పూజలు చేసి దానాలు చేయడం వల్ల పాపాల నుంచి విముక్తి లభిస్తుందని, సిరిసంపదలు పెరుగుతాయని నమ్ముతారు. అమావాస్య రోజున పితృ దేవతలకు శ్రాద్ధ కర్మలు, తర్పణాలు, పిండప్రదానాలు చేస్తారు. ఇలా చేయడం వల్ల పితృదేవతల ఆత్మకు శాంతి కలుగుతుందని, వారి ఆశీస్సులు లభిస్తాయని విశ్వసిస్తారు. ఆషాఢ అమావాస్య రోజున ప్రజలు పూజలు చేయడంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం కొన్ని ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటారు.

లక్ష్మీదేవి అనుగ్రహం కోసం..
ఆషాఢ అమావాస్య రోజున పూజలు చేయడంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం కొన్ని ప్రత్యేకంగా అర్చనలు చేయాలి. దీన్ని ఆషాఢ అమావాస్య అర్చనగా పిలుస్తారు. ఆషాఢ అమావాస్య నాడు స్నానం, దానం చేయడానికి శుభ ముహూర్తం తెల్లవారు జామున 4:05 నుండి 40 నిమిషాల పాటు అంటే 4:45 వరకు ఉంటుంది. సర్వార్ధ సిద్ధి యోగం తెల్లవారు జామున 5:25 నుండి ఉదయం 10:40 నిమిషాల వరకు ఉంటుంది.
ఆషాఢ అమావాస్య రోజున చేయవలసిన దానాలు
పవిత్ర నదులలో స్నానం చేసి పితృదేవతల పేరు మీద వస్త్రాలు, గొడుగు, చెప్పులు మొదలైనవి దానం చేయడం వల్ల వాళ్ల అనుగ్రహం లభిస్తుంది. ఆషాఢ అమావాస్య రోజున నీరు, పండ్లు, నూలు వస్త్రాలు, ధనం, ధాన్యం మొదలైనవి దానం చేయడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల జీవితంలో సంపద పెరుగుతుందని, సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని నమ్ముతారు.
ఆషాఢ అమావాస్య: ధన లాభం కోసం చేయవలసిన పరిహారాలు
హిందూ ధర్మంలో లక్ష్మీదేవిని ధనానికి అధిదేవతగా కొలుస్తారు. అమావాస్య తిథి నాడు లక్ష్మీదేవిని శాస్త్రోక్తంగా పూజించడం ఎంతో శ్రేయస్కరం. ఈ రోజున లక్ష్మీదేవికి తామర పువ్వులు, పాయసం మొదలైనవి సమర్పించాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి, ధన లాభం కలుగుతుందని విశ్వసిస్తారు.
అమావాస్య రోజున ఆంజనేయుడి ఆలయానికి వెళ్తే సర్వదోషాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. హనుమంతుడి విగ్రహం ముందు నెయ్యి దీపం వెలిగించాలి. అనంతరం హనుమాన్ చాలీసా పఠించి, స్వామికి పసుపు రంగు సింధూరం సమర్పించాలి. ఇలా చేయడం వల్ల ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని నమ్ముతారు.
ఈ రోజు ఉదయం పితృదేవతలకు తర్పణం చేస్తారు. పితృదేవతలకు తర్పణం చేయడానికి, ఒక రాగి చెంబులో గంగాజలం కలిపి, నల్ల నువ్వులు వేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తారు. దీనివల్ల పితృదోషాలు తొలగిపోతాయని చెబుతారు. పితృదేవతల పేరు మీద దానాలు కూడా చేస్తారు.












Click it and Unblock the Notifications