"వన్‌ప్లస్" కొత్త ప్రీమియం టాబ్లెట్ లాంఛ్.. ప్యాడ్ 3 ప్రో ధర ఎంతంటే ??
ప్రముఖ స్మార్ట్ డివైస్ తయారీ సంస్థ వన్‌ప్లస్ (OnePlus) తన కొత్త ప్రీమియం టాబ్లెట్ వన్‌ప్లస్ ప్యాడ్ 3 ప్రో (OnePlus Pad 3 Pro)ను చైనాలో విడుదల చేసింది. గతంలో వచ్చిన వన్‌ప్లస్ ప్యాడ్ 2 ప్రోకు సక్సెసర్‌గా వచ్చిన ఈ టాబ్లెట్, భారీ బ్యాటరీ, అత్యాధునిక ప్రాసెసర్, హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, శక్తివంతమైన ఆడియో సిస్టమ్ వంటి ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో మార్కెట్లోకి అడుగుపెట్టింది. పెద్ద డిస్‌ప్లే, అధిక పనితీరు, మల్టీటాస్కింగ్ సామర్థ్యాలు, గేమింగ్ అనుభవం, కంటెంట్ క్రియేషన్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ టాబ్లెట్‌ను కంపెనీ రూపొందించింది. విద్యార్థులు, ప్రొఫెషనల్స్, గేమింగ్ ప్రేమికులు, కంటెంట్ క్రియేటర్లను లక్ష్యంగా చేసుకుని వన్‌ప్లస్ ఈ డివైస్‌ను తీసుకొచ్చింది.
ధరలు & వేరియంట్లు..
వన్‌ప్లస్ ప్యాడ్ 3 ప్రో రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది.
12GB RAM + 256GB స్టోరేజ్ - 4,399 యువాన్లు (సుమారు రూ.61,500)
16GB RAM + 512GB స్టోరేజ్ - 5,399 యువాన్లు (సుమారు రూ.75,500)
ప్రస్తుతం ఈ టాబ్లెట్ చైనాలో కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా విక్రయానికి అందుబాటులో ఉంది. ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో, ముఖ్యంగా భారత్‌లో లాంచ్‌కు సంబంధించి కంపెనీ త్వరలో ప్రకటన చేసే అవకాశం ఉందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.

OnePlus Pad 3 Pro ఫీచర్స్..
వన్‌ప్లస్ ప్యాడ్ 3 ప్రోలో 13.2 అంగుళాల LCD డిస్‌ప్లేను అందించారు. పెద్ద స్క్రీన్, అధిక రిజల్యూషన్ కారణంగా వీడియో స్ట్రీమింగ్, డిజైన్ పనులు, డాక్యుమెంట్ ఎడిటింగ్, గేమింగ్ వంటి పనులకు ఇది అనువుగా ఉంటుంది.
డిస్‌ప్లే ముఖ్య ఫీచర్లు:
3392 × 2400 పిక్సెల్స్ రిజల్యూషన్
7:5 యాస్పెక్ట్ రేషియో
144Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్
1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్
98% DCI-P3 కలర్ గామట్
HDR కంటెంట్‌కు మెరుగైన కలర్ ప్రొడక్షన్
Eye Comfort మోడ్, తక్కువ బ్లూ లైట్ సపోర్ట్
ప్రాసెసర్..
ఈ టాబ్లెట్‌కు ప్రధాన ఆకర్షణ Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్. ఇది ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత శక్తివంతమైన మొబైల్ ప్రాసెసర్లలో ఒకటిగా చెప్పవచ్చు. ఫ్లాగ్‌షిప్ స్థాయి CPU, GPU పనితీరు, మెరుగైన AI ప్రాసెసింగ్ సామర్థ్యం, తక్కువ పవర్ వినియోగం, హై-ఎండ్ గేమింగ్‌కు సపోర్ట్.. హెవీ మల్టీటాస్కింగ్, వీడియో ఎడిటింగ్‌కు అనుకూలం
స్టోరేజ్..
గరిష్టంగా 16GB RAM
512GB ఇంటర్నల్ స్టోరేజ్
సాఫ్ట్ వేర్..
ColorOS 16 ఆధారిత యూజర్ ఇంటర్‌ఫేస్, మెరుగైన స్ప్లిట్ స్క్రీన్, మల్టీ విండో ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
బ్యాటరీ..
వన్‌ప్లస్ ప్యాడ్ 3 ప్రోలో 13,380mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అందించారు. 67W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే ఎక్కువసేపు వీడియో స్ట్రీమింగ్, ఆఫీస్ పనులు, గేమింగ్ వంటి కార్యకలాపాలను నిర్వహించవచ్చు.
కెమెరా..
13MP రియర్ కెమెరా
8MP ఫ్రంట్ కెమెరా
HD వీడియో కాలింగ్ సపోర్ట్
ఆడియో..
వన్‌ప్లస్ ప్యాడ్ 3 ప్రోలో 8 స్పీకర్ల సిస్టమ్ను అందించారు. దీంతో సినిమాలు, మ్యూజిక్, గేమింగ్‌లో మెరుగైన సరౌండ్ సౌండ్ అనుభవం లభిస్తుంది. డ్యూయల్ మైక్రోఫోన్లు, AI నాయిస్ రిడక్షన్, స్పేషియల్ ఆడియో సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
కనెక్టివిటీ ఫీచర్లు..
Wi-Fi 7
Bluetooth 5.4
USB 3.2 Gen 1 పోర్ట్
Face Unlock
ఫాస్ట్ ఫైల్ ట్రాన్స్‌ఫర్ సపోర్ట్
ఇతర వన్‌ప్లస్ డివైస్‌లతో సులభమైన ఎకోసిస్టమ్ కనెక్టివిటీ
స్లిమ్ డిజైన్..
భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ ఈ టాబ్లెట్ కేవలం 5.94mm మందం మాత్రమే కలిగి ఉంది. దీని బరువు 672 గ్రాములు మాత్రమే కావడం విశేషం. మెటల్ బాడీ, స్లిమ్ ప్రొఫైల్ కారణంగా ప్రీమియం లుక్‌ను అందిస్తుంది.












Click it and Unblock the Notifications