SIR: బీఎల్వోల కోసం ఎదురుచూడొద్దు..! ఏపీ ఓటర్లకు ఈసీ కీలక సూచన..!
ఏపీలో ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ(SIR) ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. ఇప్పటికే బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి ఎస్ఐఆర్ నమోదు ఫారాల్ని ఓటర్లకు అందిస్తున్నారు. వీటిని నింపిన తర్వాత తిరిగి తీసుకెళ్లేందుకు రాబోతున్నారు. అయితే లక్షల సంఖ్యలో ఉన్న ఓటర్లకు పూర్తి స్దాయిలో ఈ ఫారాలు అందించడం, తిరిగి నింపిన తర్వాత వాటిని సేకరించడం బీఎల్వోలకు కూడా పెను భారంగా మారుతోంది. అలాగే బీఎల్వోల కోసం ఎదురుచూడటం ఓటర్లకూ ఇబ్బందే.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (CEO) వివేక్ యాదవ్ ఇవాళ ఓటర్లకు కీలక సూచన చేశారు. మీ ఓటు హక్కును మరింత బలోపేతం చేసుకునే సమయం వచ్చిందని ఏపీ ఓటర్లకు ఆయన తెలిపారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) 2026లో భాగంగా మీ ఓటర్ వివరాలను ధృవీకరించుకోవడానికి ఇక BLOల కోసం వేచి చూడాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. ఇప్పుడు మీ స్మార్ట్‌ఫోన్ ద్వారానే ఇంట్లో కూర్చుని ఆన్‌లైన్‌లో EF (Enumeration Form) పూర్తి చేయవచ్చన్నారు.

📢 ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు గమనిక!
— Chief Electoral Officer, Andhra Pradesh (@CEOAndhra) June 18, 2026
మీ ఓటు హక్కును మరింత బలోపేతం చేసుకునే సమయం వచ్చింది! 🗳️
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) - 2026 లో భాగంగా మీ ఓటర్ వివరాలను ధృవీకరించుకోవడానికి ఇక BLOల కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీ స్మార్ట్‌ఫోన్ ద్వారానే ఇంట్లో కూర్చుని ఆన్‌లైన్‌లో… pic.twitter.com/VvMhXuK4lg
ఈ మేరకు ఆయన ఓ వీడియోను కూడా ఎక్స్ లో షేర్ చేశారు. ఇందులో ఎస్ఐఆర్ ఫామ్ ఎక్కడి ఉంటుంది, దాన్ని ఎలా నింపాలన్న అంశాల్ని కూడా షేర్ చేశారు. ఓటర్లు http://voters.eci.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని, ఎపిక్ నంబర్ నమోదు చేసి OTP ద్వారా లాగిన్ అవ్వాలని కోరారు. అలాగే పాత రికార్డులతో తమ వివరాలను అనుసంధానం చేసి, ఆధార్ ఈ-సైన్ ద్వారా సురక్షితంగా ఫారమ్‌ను సబ్మిట్ చేయాలని సూచించారు. ఇది అత్యంత సులభం, సురక్షితం, వేగవంతమని తెలిపారు. ఈ రోజే మీ వివరాలను నమోదు చేసుకోవాలని, మీ ఓటు హక్కును భద్రపరుచుకోవాలని ఓటర్లను ఆయన కోరారు. అదనపు వివరాల కోసం ఈసీ వెబ్‌సైట్: http://voters.eci.gov.in ను సంప్రదించాలని సీఈవో సూచిస్తున్నారు.














Click it and Unblock the Notifications