2025లో ఈ రాశులకు ఏలిననాటి శని... బంగారం పట్టుకున్నా బూడిదే
నవగ్రహాల్లో కీలక గ్రహమైన శనిదేవుడు న్యాయదేవత. ఆయన చేసిన కర్మలను బట్టి ఫలితాలను ప్రసాదిస్తుంటాడు. వచ్చే ఏడాది మార్చి 29వ తేదీన కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశించడంవల్ల ఆరు రాశులకు శనిదోషం పట్టుకుంటుంది. సప్తమ శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలిననాటి శని దోషాలవల్ల వీరికి అనారోగ్యం కలుగుతుంది. అన్నిరంగాల్లో విఫలమవుతారు. ఆర్థిక సమస్యలుంటాయి. ఏయే రాశులవారికి శనిదేవుడి దోషం పట్టుకుంటుంది, అది తొలగాలంటే ఏం చేయాలి? అనే విషయాలను తెలుసుకుందాం.
ధనుస్సు
అర్దాష్టమ శనిదోషం కలుగుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యత తగ్గుతుంది. అనారోగ్యం ఎక్కువగా ఉంటుంది. కష్టార్జితం మొత్తం వృథా అవుతుంది. ఆదాయ ప్రయత్నాలు సరిగా జరగవు. ఇంటికి సంబంధించి, వాహన ప్రయత్నాలకు అడ్డంకులు ఏర్పడతాయి. ఆస్తి సమస్యలు వస్తాయి.

కుంభం
రావల్సిన డబ్బు చేతికి అందదు. ఆదాయం తగ్గిపోతుంది. శ్రమ ఎక్కువగా ఉండి ఫలితం చాలా తక్కువగా వస్తుంది. శుభకార్యాలు సరిగా జరగవు. డబ్బు తీసుకున్నా, ఇచ్చినా అవి పరిష్కారం కావు. ఏలిననాటి శనిదోషం ప్రారంభమవుతుంది.
మీనం
అనారోగ్యాలున్నాయి. ప్రయాణాలవల్ల నష్టాలేకానీ లాభాలు లేవు. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. విజయాలు ఉండవు. అన్నీ వైఫల్యాలే. ప్రతి పనికి శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి పనికి ఆటంకాలేర్పడతాయి.
మేషం
ఉద్యోగస్తులు దూర ప్రాంతాలకు బదిలీ అవుతారు. ఆదాయం పెరగదు. సకాలంలో రావల్సిన డబ్బు చేతికి అందదు. జీవితం నిస్సారంగా అనిపిస్తుంది. ఉద్యోగులకు వేతనం పెరగదు. బంధువుల, స్నేహితులవల్ల తీవ్రంగా నష్టపోతారు. మంచి మిత్రులుగా ఉన్నవారు కూడా ఈ సమయంలో శత్రువులుగా మారతారు. ప్రతి పనిలోను అడ్డంకులు ఏర్పడతాయి.
సింహం
ప్రతి పని ఆలస్యంగా జరుగుతుంటుంది. వృత్తి, వ్యాపారాలన్నీ మందగిస్తాయి. పెళ్లి ప్రయత్నాలు కొలిక్కి రావు. ఉద్యోగంలో శ్రమ ఎక్కువగా ఉంటుంది. రావల్సిన డబ్బు చేతికి అందదు. అష్టమ శని ప్రారంభమవుతుంది. ఆర్థిక లావాదేవీలన్నీ నష్టాలనే కలిగిస్తాయి.
కన్య
భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తుతాయి. వ్యాపారంలో భాగస్వాములుగా ఉన్నవారికి గొడవలు వస్తాయి. పనిలో శ్రమ ఎక్కువగా ఉన్నప్పటికీ ఫలితం చాలా తక్కువగా ఉంటుంది. వృత్తిలో ఆదాయం రాదు. పెళ్లి పనులు చివరి వరకు వచ్చి వెనక్కి వెళతాయి.
పరిహారాలు: నలుపురంగు, నీలం రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఇంద్ర నీలం పొదిగిన ఉంగరాన్ని ధరించాలి. శనిదేవుడికి తైలాభిషేకం చేయించండి. పరమేశ్వరుడికి అభిషేకం చేయించాలి. దీనివల్ల శనిదేవుడి దోషం తొలగిపోతుంది.












Click it and Unblock the Notifications