6వేల సంవత్సరాల తర్వాత అరుదైన సూర్యగ్రహణం.. రింగ్ ఆఫ్ ఫైర్.. జాగ్రత్త!
ఈ సంవత్సరం అక్టోబరు 2వ తేదీన బుధవారం నాడు మహాలయ అమావాస్య నాడు సూర్య గ్రహణం ఏర్పడుతుంది. ఈ సూర్య గ్రహణం దాదాపు ఆరు వేల సంవత్సరాల తర్వాత వస్తున్న సూర్య గ్రహణం. ఈ సూర్య గ్రహణంలో చంద్రుడు సూర్యుడికి అడ్డుగా వచ్చినప్పుడు ఒక రింగ్ మాదిరిగా సూర్యుడు కనిపిస్తాడు. దీనిని రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు.
సూర్యగ్రహణం ఇండియాలో కనిపిస్తుందా?
ఇలాంటి సూర్య గ్రహణం మహాభారత కాలం నాడు ఏర్పడిందని, మళ్ళీ ఇప్పుడు ఏర్పడుతుందని చెప్తున్నారు. కనుక ఈ సూర్య గ్రహణం చాలా శక్తివంతమైనదని, ప్రభావ వంతమైనదని చెప్తున్నారు. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళ రేఖ మీదికి వచ్చినప్పుడు లోకానికి వెలుగు నిచ్చే సూర్యుడిని రాహువు మింగేస్తాడు. అంటే అడ్డుపడతాడు. దీని వల్ల సూర్య గ్రహణం ఏర్పడుతుంది. ఈ సంవత్సరం రేపు ఏర్పడే సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు.

సూర్య గ్రహణ సమయం ఇదే
ఎందుకంటె భారతదేశంలో సూర్య గ్రహణ కాలం రాత్రి కావటంతో ఇది కనిపించదు. ఇది రాత్రి 9.13 గంటలకు ప్రారంభమై గురువారం తెల్లవారుజామున 3:17 గంటల వరకు కొనసాగుతుంది. అంటే దాదాపు 6 గంటల 4 నిమిషాల వరకు ఉంటుంది. హిందూ ధర్మంలో గ్రహణాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. గ్రహణాలు ఏర్పడిన సమయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతారు. గ్రహణాలు చాలా పవర్ ఫుల్ అని చెప్తున్నారు.
గ్రహణ సమయంలో నియమాలు పాటించాలి
గ్రహణ సమయం లో ఆలయాలనే మూసివేస్తారు అంటే గ్రహణాలకు ఉండే ప్రభావం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. అయితే భారతదేశంలో గ్రహణ ప్రభావం ఉండదని చెప్తున్నారు. అయితే గ్రహణ ప్రభావం ఉన్న చోట తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలని సూచిస్తున్నారు. గ్రహణ సమయంలో పాటించవలసిన నియమాలను గురించి, తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి పండితులు అనేక విషయాలను చెప్పారు.
గ్రహణ సమయంలో జాగ్రత్త
గ్రహణం సమయంలో ఎవరు గ్రహణాన్ని నేరుగా చూడకూడదు. ఒకవేళ అలా చూస్తే వారికి అంధత్వం వచ్చే ప్రమాదం ఉంటుంది. పూర్తిగా కంటిచూపును కోల్పోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. గ్రహణం సమయంలో సూర్యుని నుండి వచ్చే అతినీలలోహిత కిరణాల ప్రభావం శరీరంపై పడితే దాని వలన ఇబ్బందులు వస్తాయి. కాబట్టి గ్రహణ సమయంలో అందరూ ఇళ్లలోనే ఉండాలని సూచిస్తున్నారు. గ్రహణం సమయంలో ఎవరూ భోజనం చెయ్యకూడదు.
గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో జాగ్రత్త
గ్రహణ సమయంలో ఇళ్ళలో ఎలాంటి పనులు చేయకూడదు. అందరూ ఇంట్లోనే ఉండాలి. గర్భిణి స్త్రీలు గ్రహణ సమయంలో కూరగాయలను కొయ్యటం, బరువైన పనులు చెయ్యటం, భోజనం చెయ్యటం, చేస్తే , కడుపులోని బిడ్డపై ప్రభావం పడి ఏదో ఒక లోపంతో వారు పుడతారని చాలామంది విశ్వసిస్తారు. అందుకే గర్భిణీలు గ్రహణ సమయంలో కదలకుండా పడుకోవాలి. గ్రహణం సమయంలో పొరపాటున కూడా గర్భిణీలు ముఖ్యంగా ఆహారం తీసుకోకూడదు. గ్రహణానికి ఆరు గంటల ముందే ఆహారం తీసుకోవాలి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
కర్కాటకరాశి వారికి ఈ ఏడాది పట్టిందల్లా బంగారం.. అన్నింటా విజయం! -
వాస్తు ప్రకారం ఇంటి మెయిన్ డోర్ ఆర్థిక ఇబ్బందులకు కారణమవుతుంది తెలుసా? -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
ఇంటికి వాస్తు దోషాలుంటే రూపాయి ఖర్చు లేకుండా ఇలా చేయండి -
today rashiphalalu: నేడు బృహస్పతి, బుధుల స్థానాలలో మార్పు.. వీరికి జాక్ పాట్! -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం..












Click it and Unblock the Notifications