Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శ్రీ విళంబి నామ సంవత్సర పంచాంగ ఫలితాలు

డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

Sri Vilambi 2018- 2019 Panchangam

గమనిక:- ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి,గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది.ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము.మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి,ఇది గమనించగలరు.కావున మీ పూర్తి జాతక వివరాల కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ,తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను,తరునోపాయలను అడిగి తెలుసుకోగలరు.

రాజాది నవనాయక నిర్ణయ ఫలములు.
1. రాజు - రవి (సూర్యుడు)
ఫలితం:- రవి రాజుగా ఉన్న సంవత్సరంలో దేశ రాజకీయ పరివర్తనం,రాజకీయ కల్లోలములు ఉంటాయి.రాజకీయ నాయకులకు పరప్సర విరోధములు ఉంటాయి.వర్షములు తక్కువగా పడతాయి.ప్రజలకు పభువులచే,ఆయుధాలతో భయములు ఏర్పతాయి.అగ్నికి సంబంధించిన బాధలుంటాయి.పంటలు తక్కువగా పండుతాయి,నష్టం ఏర్పడుతుంది.దుర్మార్గులచే భయాలు,రోగాలు,రాజకీయ ప్రముఖుల మరణాలు ఉంటాయి.

2. మంత్రి-శని.
ఫలితం:- శని భగవానుడు మంత్రి అవటం చేత పంటలు తక్కువ పండుతాయి.ప్రజలు దుర్మార్గుల(గూండాలచే) పీడింప బడతారు.దొంగతనాలు ఎక్కువౌతాయి.నిత్య పీడ.అగ్నికి సంబంధించి ప్రమాదాలుంటాయి.ప్రజల ధన,మాన,ప్రాణహాని జరుగుతుంది.దాన్యపు ధరలు పెరుగుతాయి.

3. సైన్యాధిపతి-శుక్రుడు.
ఫలితం:-వర్షములు సమృద్ధిగా పడును, పంటలు బాగా పండుతాయి.ప్రభుత్వాల పాలన అనుకూలంగా ఉండును.ధాన్యాదులకు ధరలు అనుకూలంగా ఉండును.వస్త్ర,దూది,నూలు,వెండి,బంగారం,నూనె ధరలు పెరుగుతాయి. స్త్రీ,పురుషులు శృంగారం పట్ల ఎక్కువ ఆసక్తిని కలిగియుందురు.దుర్మార్గుల వలన స్త్రీలకు ధన,మాన,ప్రాణ హాని ఎక్కువగా ఉంటుంది.

4. సస్యాధిపతి- చంద్రుడు.
ఫలితం:-నీటికి సంబంధించిన ధాన్యములు,మాగాణి,మెట్ట పంటలు,వృక్షజాతులు బాగుగా అభివృద్ధి ఫలాలనిచ్చును.

5. ధాన్యాధిపతి - చంద్రుడు.
ఫలితం:- పశువులు సమృద్ధిగా పాలనిచ్చును.ప్రజలు ఆరోగ్యంతో, సుభిక్షంతో ఉంటారు .వర్షాలు విస్తారంగా పడుతాయి.వెన్న,నెయ్యి,పాలు,పెరుగు,వెండి,బంగారం,బియ్యం,చెరకు,చక్కర ధరలు అందుబాటులో ఉంటాయి.

6. అర్ఘాధిపతి - శుక్రుడు

7. మేఘాధిపతి -శుక్రుడు.
ఫలితం:- అతివృష్టి, సుభిక్షం,సస్యవృద్ధి,ప్రజలు,పశువులు ఆరోగ్యంగా ఉంటారు.

8. రసాధిపతి - గురువు.
ఫలితం:-బంగారం,వెండి,నెయ్యి,పట్టు,పత్తి,బెల్లం,పంచదార,చెరుకు,వస్త్రముల ధరలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి.అత్యధికంగా వర్షాలు పడుతాయి.పాడి పంటలకు సమృద్ధి కలదు.

9. నీరసాధిపతి - చంద్రుడు.
ఫలితం:-ముత్యములు,రత్నములు,బంగారం,వెండి,కంచు,మొదలగు లోహములు,వస్త్రములు,అలంకార వస్తువుల ఉత్పత్తి అధికమగుటచేత ధరలు అందుబాటులో ఉంటాయి.
10. పశు పాలకుడు- యముడు
11. గోష్ట ప్రాపకుడు - శ్రీకృష్ణుడు
12. గోష్ట బహిష్కర్త - శ్రీ కృష్ణుడు.

శ్రీ విలంభినామ 2018-19 సంవత్సరం,పంచాంగ రిత్యా రాజాధి నవనాయక గ్రహా స్థాన ఆధార ఫలితాలు.

* యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహాస్వామి ఖ్యాతి అధికమౌతుంది.

* దేశంలో వ్యవసాయం,వ్యాపారాలు సునాయసంగా చేసుకునే పరిస్థితి లేదు.

* దేశ ఆర్ధిక పరిస్థితి దిగజారుతుంది.

* లోకసభ ఎన్నికలలో BJP విజయం సాధిస్తుంది.

* తెలంగాణలో అసెంబ్లి ఎన్నికలలో TRS విజయం సాధిస్తుంది.

* మధ్యం (కల్తీ) విస్తృతంగా విజృంభింస్తుంది.

* కేంద్ర మంత్రులు కొందరు వివాదస్పద విషయాల్లో ఇరుక్కుంటారు.

* కాంగ్రేస్ వారికి ప్రస్తుత కాలం అంత అనుకూలంగా లేదు.

నిజాయితిగా వ్యాపారం చేసుకునే వారికి మంచి రోజులు కావు.

* దేశంల్లో రౌడియిజాలకు,దౌర్జన్యాలకు హద్దులు లేకుండా పోతుంది.

* వాయు ,రోడ్డు సంబందమైన ప్రయాణాలలో ప్రముఖులకు ప్రాణగండ సూచనలున్నాయి.

* దాదాపు అన్ని రంగాల వారికి ఆర్ధిక పరిస్థితిలలో అంతంత మాత్రమే ఉంటుంది.

* తెలుగు రాష్ట్రాలలో క్రీడాకారులకు ప్రోత్సాహం లభిస్తుంది.

* మంచి భవిష్యత్ కలిగిన ఓ ప్రజానాయకునికి ప్రాణగండ ప్రమాదం ఉన్నది.

* హిందూ ధర్మనికి గడ్డుకాలంగా పరిగణించవచ్చు.

* అల్యూమినియం,కాపర్,ఇనుము,గోల్డ్,వంటగ్యాస్,పెట్రోల్ ధరలు అధికంగా ఉంటాయి."బంగారం ఎప్పుడు బంగారమే"

* బ్యాంక్ వ్యవహారాలలో సామన్య ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయి.

* ప్రతి వ్యాపారంలో కూడా ఎంతో కొంత అసంతృప్తితోనే వ్యావహారాలు నడుస్తాయి.

* చిన్న సినిమాలకు అనుకూలంగా ఉంటుంది.

* భూముల కుంభకోణాలలో మళ్లి సంచలనాలు కనిపిస్తాయి.

* ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది సుమారు 50 డిగ్రీలు దాటిన ఆశ్చర్య పోనక్కరలేదు.

* దేశంలో ప్రకృతి భీభత్సాలు,ఆరాచకుల దౌర్జన్యాలు పెట్రేగి పోతాయి,హై అలర్ట్ లు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

* సామన్యులకు తిండికి,వైద్యానికి,చదువునకు ఖర్చులు ఆకశంలో చుక్కలను చూపిస్తాయి.

* ఈ సంవత్సరం కూడా నకిలీ బాబాల భాగోతాలు వెలుగులోకి వస్తాయి.

* చర్మవ్యాధులు,షుగర్ వ్యాదులు,ఊబకాయం,తైరాడ్,కంటి జబ్బులు,శ్వాస సంబంధమైన,మానసిక బాధలు వ్యాధులు ఎక్కువైతాయి.

* దొంగ తనాలు కొత్త (వింత) మార్గంలో పట్టపగల్లే ఎక్కువ జరుగుతాయి.

* దౌరజన్యాలు,ఆరాచకాలు ఎక్కువవుతాయి.

* రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు అనుకూలం కాదు.

* కూరగాయలు,ఉల్లి,నూనె,గోధుమలు,పసుపు,మిరియాలు,జీలకర్ర,చిరుధాన్యాల ధరలు అధికంగా ఉంటాయి.

* నెలలు నిండక ముందే పుట్టే పిల్లల సంఖ్య అధికమౌతుంది.

* సరిహద్దులలోయుద్ధం ఏర్పడే అవకాశాలు మెండుగా గోచరిస్తున్నాయి.

* ప్రాంతీయ విద్వేషాలు,వివాదాలు,తగాదలు,రౌడీయిజం,భౌతిక దాడులు అధికమౌతాయి.

* విద్యా సంస్థలలో కులసంఘాలు ఎక్కువవుతాయి.

* జాతక దోషమో,కలి దోషమో కాని మగపిల్లలకు పెళ్ళి సంబంధాలు ఓ పట్టాన కుదరక ఇబ్బందులు పడతారు.

* విడాకులు (నూతన జంటలు) తీసుకునే సంఖ్య అధికమౌతాయి.

* విహార యాత్రలలో ఈతలకు సంబంధించి(విద్యార్ధులకు)ప్రమాదాలు,అపసృతులు చోటుచేసుకోనున్నాయి.

* పౌల్ట్రీ రంగం,పత్తి,పోగాకు,మామిడి పంటలు పండించే రైతులకు పరీక్షా కాలం,కోంత చేదు అనుభావలు చోటుచేసుకోనున్నాయి.

* పశు,పక్షులకు ప్రకృతి భీభత్సవాలలో,అధిక ఎండల కారణంగా ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొటాయి.

* వైద్యరంగాలలో మోసాలు అధికమౌతాయి.

* అధిక ఉష్ణోగ్రత వలన హిమాలాయలలో మంచు పర్వతాలపై ప్రభావం పడుతుంది.

* కులవృత్తులపై ఆధారపడే వారికి కష్టాలు అధికంగా ఉంటాయి.

* ఎక్కువ శాతం యువత మత్తు,మాదక ద్రవ్యాలకు,శృంగారానికి ఆకర్షితులై పెడదారి పడతారు.

* సెల్ఫీ పిచ్చితో,వెర్రి పోటితో భయంకరమైన ప్రమాదాల నడుమ జీవితంతో చెలాగాటాలాడుకుంటారు.

* నదీ,సముద్రాలలో సాహసకృత్యాలు చేయకూడదు,ప్రాణ గండ సూచనలు గోచరిస్తునాయి.

* మనీ సర్క్యులేషన్లు,చిట్టిలు మొదలగు వాటిలో మోసాలు అధికమౌతాయి.

* పోటి పరీక్షలలో స్త్రీలదే పై చేయి ఉంటుంది.

* వింత వింత మోసాలను చవిచూడ వలసి వస్తుంది.

* దంపతుల మద్య అన్యోన్యత లోపం,అవగాహణ లోపాలు అధికమౌతాయి.

* కుటుంబంలో పిల్లలు పెద్దల మాటలను పెడచెవిన పెడతారు,స్వంత నిర్ణయాలకు ప్రాధాన్యతనిచ్చుకుంటారు,అదోగతి పాలు అవుతారు.

* పోటి తత్వం పెరుగుతుంది,అనుకున్నది సాధించడానికి అనేక మార్గాలు ఎంచుకుంటారు,విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తారు.

* ప్రేమ అనురాగాలకు,గౌరవ మర్యాదలకు,ఆత్మీయతలకు దూరం అవుతారు.

* స్వార్ధం విళయ తాండవం చేస్తుంది.

గమనిక:- ఈ సంవత్సరం పంచాంగ ఆధారంగా దేశ గోచార గ్రహ స్థితులపై తెలిపిన ఫలితాలు ఎక్కువ శాతం జరిగే అవకాశాలు ఉన్నాయి.మీకు సంబంధించిన ఫలితాలకొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి మీ జాతక చక్రంలో గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకుని వారు సూచించే దోష నివారణలను భక్తి శ్రద్ధలతో ఇష్ట పూర్వకంగా పాటించినచో తప్పక శుభఫలితాలు పొందుతారు.

*మీకు గ్రహస్థితులు అనుకూలంగా మారాలంటే ఇవి తప్పక ఆచరించండి.
1. తలిదండ్రులను మీ కన్న బిడ్డల వలే చూసుకోండి.వారి మనస్సుకు,శరీరానికి,అవసరాలకు ఏ ఇబ్బంది కలుగ కుండా జాగ్రత్తగా చూసుకోండి.
2. దైవానికి,దాన,ధర్మాలకు,సామాజిక సేవలకు దగ్గరగా ఉండండి.
3. ఎవరితోను తగాదాలకు,విభేదాలు,మోసాలకు,తలపడకండి.
4. విద్యనేర్పిన గురువులను,మీకు అండగా ఉంటూ మార్గం చూపిన వారిని,మీ కష్టాలలో ఆదుకున్నవారిని,జీవిత భాగస్వామిని,తోబుట్టువులను,అత్త మామలను,మీశ్రేయస్సు కోరే వారిని ఎల్లప్పుడు గౌరవిస్తూ వారికి ఎలాంటి హాని కలగకుండా చూడండి.
5. మానవ విలువలను గౌరవించండి.నీకున్న ఆకలి,అవసరాలు అందరికి ఉంటాయి అని గ్రహించండి.
6. సాటి వారికి మీ శక్తి కొలది పనులలో సహయపడండి.
7. పేదవారికి రక్షణగా ఉంటూ,వారి అవసరాలకు ధీమాను,చేయుతనివ్వండి.
8. ఎండా కాలం అన్ని జీవులకు,వృక్షాలకు దాహన్ని తీర్చండి.
9. పశు,పక్షులకు చిరుధాన్యం,త్రాగడానికి మంచి నీళ్ళని అందించండి.
10. వృద్ధులకు,అవిటి వారికి,వితంతువులకు,పిల్లలకు,ఆనారోగ్యంతో భాదపడుతున్నవారికి మీకు చేతనైన ఏదో ఒక సహాయం చేయండి.
11.కుటుంబ,మానవ,ధర్మ సంబంధమైన బాధ్యతలలో దేనిని విస్మరించక తూచ తప్పకుండా పాటించినచో తప్పక మీకు ఏ గ్రహ బాధలు ఇబ్బంది పెట్టవు,ఏ పాపము అంటుకోక సుఖంగా జీవిస్తారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+