జూన్ లో ఈ రాశులకు సూపర్ లక్; వారికి తిరుగేలేని హర్షన యోగం!!

వేద జ్యోతిష్య శాస్త్రంలోని 27 యోగాలలో 14 వ యోగంగా హర్షన యోగం చెప్పబడుతుంది. ఇది చాలా శుభ యోగం. హర్షన యోగం ఉన్న సమయంలో అనేక శుభకార్యాలను చేయడానికి శుభ ముహూర్తంగా చెప్పబడింది. హర్షన యోగం ఒక శుభ యోగం. సంతోషకరమైన, ఆనందకరమైన ,ఆహ్లాదకరమైన శక్తిని ఈ యోగం అందిస్తుంది . సూర్యుడు ఈ యోగానికి అధిపతి. ఈ యోగం ఉన్న సమయంలో ఎటువంటి శుభకార్యమైనా చెయ్యొచ్చు.

హర్షన యోగం జూన్ నెలలో ఎప్పుడంటే
జూన్ నెలలో 22వ తేదీన ఉదయం 2:35 నిమిషాల నుండి 23వ తేదీ ఉదయం 3:32 నిమిషాల వరకు హర్షన యోగం ఉంటుంది. హర్షన యోగం సమయంలో జన్మించిన వ్యక్తులు చాలా డైనమిక్ గా ఉంటారు. వారు సృజనాత్మకతను కలిగినవారుగా ఉంటారు. కళలు మరియు సాహిత్యంపై వారికి ఎనలేని ఆసక్తి ఉంటుంది.

zodiac signs

సింహరాశి
హర్షన యోగం కారణంగా సింహ రాశి, మీన రాశి, వృశ్చిక రాశి జాతకులకు సూపర్ లక్ ఉంటుంది. ఈ రాశుల వారి అదృష్టం మెరుస్తుంది. సింహ రాశి జాతకులకు హర్షన యోగం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. సింహ రాశి జాతకులు ఆనందమయ జీవితాన్ని అనుభవిస్తారు. జూన్ నెలలో వచ్చే హర్షన యోగం సింహ రాశి జాతకులు సంతోషంగానూ, ప్రశాంతంగానూ ఉంటారు. నిర్వహించే ఏపనైనా సులభంగా పూర్తి చేయగలుగుతారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను పొందుతారు.

మీన రాశి
మీన రాశి జాతకులకు హర్షన యోగం వల్ల అంతర్గత శాంతి లభిస్తుంది. మీన రాశి జాతకులు లో ఉండే సృజనాత్మకత మరింతగా పెరగడానికి దోహదం చేస్తుంది. ఏ పనైనా సులభంగా సమర్థవంతంగా పూర్తి చేయడానికి హర్షన యోగం సమయం పనికొస్తుంది. మీన రాశి జాతకులు ఈ సమయంలో మంచి కీర్తిని, పలువురితో ప్రశంసలు పొందుతారు. అధికారుల వద్ద మంచి పేరు ప్రఖ్యాతులను సంపాదిస్తారు.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి జాతకులకు హర్షన యోగం శుభ ఫలితాలను అందిస్తుంది. వృశ్చిక రాశి జాతకులు చేసే పనిలో మంచి పేరును సంపాదిస్తారు. ఇంక్రిమెంట్లు పొందుతారు. పనిచేసే కార్యాలయంలో బోనస్ లను కూడా అందుకుంటారు. వృశ్చిక రాశి జాతకులు పెట్టిన పెట్టుబడులు పెరిగి కలిసివచ్చే కాలం ఇది. ఊహించని విధంగా డబ్బును ఈ సమయంలో వారు అందుకుంటారు.

zodiac signs

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+