7 అదృష్ట సంఖ్యగా ఉంటే తిరుగులేదా?

Posted By:
Subscribe to Oneindia Telugu

ఏడు అదృష్ట సంఖ్యగా గలవారికి కేతువు అధిపతి. ఏ నెలలోనైనా, సంవత్సరములో నైనా, 7, 16, 25 తేదీలలో పుట్టిన స్త్రీ పురుషులంతా 7వ సంఖ్యకు చెందిన వారు 7వ సంఖ్యకు కేతువు అధిపతి. ఈ 7వ సంఖ్యకు ప్రపంచములో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. కొందరు దీనిని భగవంతుడి సంఖ్య అని నమ్ముతారు. వీరు సోమవారం, లేదా ఆదివారం పుట్టి ఉంటే మరీమంచిది.

ఈ 7వ సంఖ్య వారు ప్రతీ సంవత్సరములో జూన్‌ 21 నుండి జులై 20లో పుట్టిన స్త్రీ పురుషులందరికీ ఈ కేతు గ్రహబలం ఎక్కువగా ఉంటుంది. ఈ నెలలో వారు 7, 16, 25 తేదీలలో చేయు పనులు మంచి అదృష్టం, మంచి అనుకూల ఫలితాలనిస్తాయి. వీరికి చంద్ర జాతకులకు 2వ సంఖ్యవారికి చాలా వరకు పోలికలుంటాయి. వీరి కలయిక, స్నేహం బాగుంటుంది. 2, 7 సంఖ్యల కలయిక చాలా అన్యన్యమయింది. మంచి స్నేహితులుగా వుంటారు.

7వ సంఖ్యలో పుట్టిన వారందరూ (7, 16, 25 తేదీలు) వ్యక్తి స్వాతంత్య్ర మును ఎక్కువగా ఇష్టపడుతారు. స్వశక్తిని, నిజాన్ని నమ్ముకొంటారు. ఈ 7వ సంఖ్యవారు పూర్తిగా తమ స్వంత నిర్ణయాలకే ఎక్కువగా విలువనిస్తారు. స్వాతంత్య్రానికే ఎక్కువ విలువనిస్తారు. ఓటమిని అంగీకరించరు. తల వంచరు. అభిమానం చంపుకోలేరు.

The persons, who are having seven as lucky number

7వ సంఖ్యలో తరచూ మార్పును కోరుకొంటారు. ప్రయాణాలంటే ఇష్టపడుతారు. వారికిష్టమైన పనులలో శ్రమగురించి ఆలోచించరు. వీరికి ఫారిన్‌ ఛాన్స్‌ రావచ్చును. ఎంత దూరం ప్రయాణాలు చేయటానికి అయినా వెనుకాడరు. వీరికి గ్రంథ పఠనమునందు ఆసక్తి ఉంటుంది. విశేషమైన లోకజ్ఞానం సంపాదించుకొంటారు.

7వ సంఖ్యలో కొందరు మంచి రచయితలు, పెయింటర్స్‌, పద్యములు, పాటలు వ్రాసేవారున్నారు. 7వ సంఖ్యవారు ఏ వృత్తినైనా చేసుకోగలరు. సంపాదించగలరు. వీరికి వేందాంతము, కళల యందు కూడా అభిరుచి ఉంటుంది.
7వ సంఖ్యవారు స్వయంకృషిపై, స్వంత తెలివి తేటల ఆధారంగా, వ్యాపారపరంగా సంపాదించగలరు. ధనవంతులు కాగలరు. ఇతరులకు సహాయం చేస్తారు.

ఇతరుల కష్టములలో పాలుపంచుకొంటారు. ధన సహాయం చేస్తారు. వీరికి వ్యాపారపరంగా మంచి తెలివి తేటలుంటాయి. వీరు తమ తెలివి తేటలను ఉపయోగించుకొంటే మంచి సంపాదన పరులు అవుతారు. వీరికి ఇమ్‌పోర్ట్‌, అండ్‌ ఎక్స్‌పోర్టు వ్యాపారాలు కూడా కలిసివస్తాయి. చేయగలరు. వీరికి నావికా దళములలో కూడా అవకాశం ఉంటుంది.

7వ సంఖ్యవారికి మతము, ఆచారములందు నమ్మకం ఉంటుంది. పాటిస్తారు. కాని కొందరు నమ్మనివారు కూడా ఉన్నారు. వీరికి కొన్ని స్వంత అభిప్రాయాలు కూడా ఉంటాయి. 7వ సంఖ్యవారు భవిష్యత్తును గుర్తించగలరు. వారి హక్కు ఫలిస్తాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The persons having lucky number will lead successful life in the society, According to the astrologer.
Please Wait while comments are loading...