రష్మికతో పెళ్లి తర్వాత రౌడీ బాయ్ క్రేజీ లీక్! (వీడియో)

టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలు జపాన్ పర్యటనను ముగించుకుని తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. అయితే ఎయిర్పోర్టులో దిగిన ఈ జంటకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తున్నాయి. ఇందులో అభిమానుల దృష్టిని ఆకర్షించింది విజయ్ దేవరకొండ మెడలోని ఓ ప్రత్యేకమైన లాకెట్(చైన్). విజయ్ తన భార్య రష్మిక మందన్నపై ఉన్న ప్రేమను చాటుకుంటూ ఆమె పేరులోని మొదటి అక్షరం 'R' ఉన్న ఓ ప్రత్యేకమైన లాకెట్ ధరించి కనిపించాడు. ఇది చూసిన 'విరోష్' అభిమానులు 'భర్త అంటే విజయ్ లాగే ఉండాలి' అంటూ సోషల్ మీడియాలో క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

జపాన్ పర్యటన నుంచి హైదరాబాద్‌కు..
రష్మిక మందన్నకు ఈ వారం చాలా ప్రత్యేకమైనదిగా నిలిచింది. ఇండియా తరఫున 'క్రంచీరోల్ అనిమే అవార్డ్స్' బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న రష్మిక.. మే 23న టోక్యో (జపాన్)లో జరిగిన 10వ వార్షిక అవార్డుల వేడుకకు అంతర్జాతీయ ప్రెజెంటర్‌గా హాజరైంది. వరుసగా రెండో ఏడాది కూడా ఆమెకు ఈ గౌరవం దక్కింది. తన భార్యామణి ఎంజాయ్ చేసేలా భర్త విజయ్ దేవరకొండ కూడా ఆమెతో కలిసి జపాన్ వెళ్లాడు. అక్కడ ఇద్దరూ కలిసి సరదాగా గడిపారు. తాజాగా హైదరాబాద్ ఎయిర్‌పోర్టులోకెమెరాకు చిక్కిన ఈ జంట.. ఫ్రెంచ్ బెరెట్ క్యాప్స్ ధరించి ఎంతో స్టైలిష్‌గా కనిపించారు. అక్కడే విజయ్ బేజ్ కలర్ టీ-షర్ట్‌పై 'R' లాకెట్ వేసుకుని జపాన్ ట్రిప్ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు.

Vijay Deverakonda Wears Special R Pendant For Rashmika Mandanna Post Japan Trip Video Viral

ఉదయ్‌పూర్‌లో సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి
ఈ ఏడాది ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న ఓ లగ్జరీ హోటల్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన సంగతి తెలిసిందే. కొన్నేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట.. పాతకాలపు పెళ్లిళ్ల పద్ధతిని గుర్తుచేసేలా సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు. ఇందులో ఇటు తెలుగు సంస్కృతితో పాటు అటు కొడవ (కూర్గ్) సాంప్రదాయ ఆచారాలను కూడా పాటించారు. పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ జరుపుకున్న మొదటి బర్త్‌డే వేడుకల్లో కూడా రష్మిక తన భర్త పక్కనే ఉండి అభిమానులకు అభివాదం చేసింది.

పెళ్లి తర్వాత ఇద్దరూ కలిసి నటిస్తున్న 'రణబాలి'
ప్రస్తుతం విజయ్ దేవరకొండ తన కెరీర్‌పై పూర్తి ఫోకస్ పెట్టాడు. ఇటీవల ఏప్రిల్ 20న దర్శకుడు శౌర్యువ్ కాంబినేషన్‌లో తన కొత్త సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించాడు. ఈ వేడుకకు నేచురల్ స్టార్ నాని కూడా హాజరయ్యాడు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. దీనితో పాటు, రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న 'రణబాలి' చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. 1854 - 1878 కాలం నాటి చారిత్రాత్మక యాక్షన్ డ్రామాగా, బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం, నాటి కరువు పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో విజయ్ దేవరకొండ స్వాతంత్య్ర సమరయోధుడు 'రణబాలి'గా నటిస్తుండగా, రష్మిక మందన్న అతని భార్య 'జయమ్మ' పాత్రలో నటిస్తోంది. హాలీవుడ్ 'మమ్మీ' సినిమా ఫేమ్ ఆర్నాల్డ్ వోస్లూ ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తుండటం విశేషం. పెళ్లి తర్వాత విరోష్ జంట కలిసి నటిస్తున్న మొదటి సినిమా ఇదే కావడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+