వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తిరుమల: అష్టబంధన బాలాయన మహా సంప్రోక్షణం అంటే ఏమిటి?

|
Google Oneindia TeluguNews

డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ ఇంటర్నేషనల్ జ్యోతిష్యులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

హైదరాబాద్/తిరుపతి: కలియుగ ప్రత్యేక్ష దైవయైన తిరిమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అష్టబంధన బాలాయన మహాసంప్రోక్షణం ఆగస్టు 11 నుంచి 15వ తేది వరకూ జరగనుంది. ఇందులో ఆగస్టు 11వ తేది శనివారం రోజు మొత్తంలో 9 గంటల సమయాన్ని మాత్రం దర్శనానికి కేటాయించనున్నారు.

ఆయా రోజుల్లో 12వ తేది ఆదివారం 4 గంటల సమయం, 13వ తేది సోమవారం 5 గంటల సమయం, 14వ తేది మంగళవారం 5 గంటల సమయం, 15వ తేది బుధశారం 6 గంటల సమయంలో మాత్రమే భక్తులకు శ్రీవారిని దర్శించే అవకాశం కల్పించనున్నారు.

The story about astabandhana balayana maha samprokshana in Tirumala

మొత్తం 29 గంటల్లో మొత్తంగా ఆగస్టు 11 నుండి 15వ తేది వరకూ అంటే ఐదు రోజుల్లో మొత్తం 29 గంటల సమయం మాత్రమే వెంకటేశ్వరున్ని దర్శించడానికి అనుమతి ఉంటుంది. ఈ సమయంలో 15 వేల మంది దర్శించుకోవచ్చు. కాబట్టి మీరు ఆ రోజుల్లో తిరుపతి ప్రయాణాన్ని పెట్టుకొని ఉంటే మాత్రం పునరాలోచించుకోండి.

క్లుప్తంగా చెప్పాలంటే ఆలయంలో మరమ్మత్తు పనులను నిర్వహించడానికి నిర్దేశించిన కార్యక్రమమే మహా సంప్రోక్షణ. అయితే శ్రీవారి ఆలయంలోకి అర్చకులు, జీయ్యంగార్లు మినహా మరెవ్వరినీ అనుమతించరు.

మహా సంప్రోక్షణ కార్యక్రమం గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ కార్యక్రమం ఎందుకు చేస్తారు ? ఎలా చేస్తారు? ఆ సమయంలో భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారా? లేదా? ఒక వేళ ఇస్తే ఏ ఏ సమయంలో ఆ దర్శణ భాగ్యం కల్పిస్తారన్న విషయం పై చర్చించుకొంటున్నారు.

The story about astabandhana balayana maha samprokshana in Tirumala

అంతేకాకుండా మిగిలిన రోజులతో పోలిస్తే వారాంతాల్లో అంటే వీకెండ్ సమయంలో శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు.

కాగా ఈ మహా సంప్రోక్షణ కార్యక్రమం కూడా అదే సమయంలో జరుగుతుండడం వలన తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలా వద్దా అన్న విషయంపై పర్యాటకులకు కొంత గందరగోళ పరిస్థితి నెలకొంటుంది.అసలు విషయాన్ని గమనిస్తే నదులకు ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి పుష్కరాలు ఏలా వస్తాయో అదే విధంగా తిరుమల శ్రీవారికి కూడా అష్టబంధన బాలాలయం మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

సాధారణంగా ప్రతి వైష్ణవ ఆలయాల్లో ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.ఆలయ నిర్మాణాల్లో ప్రధానమైనది విగ్రహ ప్రతిష్టాపన. తర్వాత శాస్త్రోక్తంగా జీర్ణోద్ధరణ పనులు,సజీవంగా ఉండే ఓ దేవతా మూర్తిని సేవిస్తున్నామనే భావన భక్తులకు కలిగేలా విగ్రహంలో ప్రాణ ప్రతిష్టాపన చేస్తారు.

కొన్ని కొన్ని సందర్భాలలో ఎదో ఒక రకంగా మలినమయ్యే అవకాశం ఉంది.తిరుమలలో శ్రీవారికి ప్రతి రోజూ అనేక ఉపచారాలు, నివేదనలు జరుగుతాయి. ఈ సమయంలో పాత్రలు లేదా కొన్ని పదార్థాలు కింద పడినప్పుడు ఎంతో కొంత మాలిన్యాలు గర్భాలయంలోకి చేరుతాయి. వీటి వల్ల కొన్ని సార్లు గర్భాలయంలో పగుళ్లు వచ్చే అవకాశం ఉంది.ఇది అపచారంగా భావించి పన్నెండు సంవత్సరాలకు ఒక సారి గర్భాలయంలో అర్చకులే వాటికి మరమత్తులు చేస్తారు.ఈ క్రమంలో మొదట మూలవిరట్ పాదాలకు పద్మపీఠం మధ్యలో ఉన్న భాగాన్ని లేపంతో నిపటమే అష్టబంధన కార్యక్రమం.

The story about astabandhana balayana maha samprokshana in Tirumala

ఈ కార్యక్రమంలో భాగంగా ఎనిమిది రకాల వస్తువులతో తయారు చేసిన చూర్ణాన్ని శ్రీవారి పాదల కింద మూలవిరాట్ సమీపంలో పెడతారు.వీటిలో నల్లసరిగళం, కరక్కాయ, ఎర్రపత్తి, వెన్న, కండచెక్కర, లక్క, చెకుముకిరాయి, బెల్లం ఉంటాయి.వీటిని ఆయా ప్రదేశాల్లో పెడతారు.ఈ వస్తువుల మిశ్రమాన్ని మూలవిరాట్ తో పాటు ఆధారపీఠం, పాదపీఠం మధ్యలో సన్నపాటి ప్రదేశంలో, మూలవిరాట్ పై భాగంలో గోడకు ఉన్న రంధ్రాల్లో ఈ చూర్ణాన్ని అద్దుతారు. ఈ మిశ్రమం కాలక్రమేన కరిగిపోవడం, రంగు మారడం వల్ల మూలవిరాట్ లో శక్తి తగ్గితోతుంది.

తిరిగి శక్తిని పెంపొందించేందుకే అష్టబంధన బాలాయన మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ మహా సంప్రోక్షణ శ్రీవారి ఆలయంలో 1958లో ప్రారంభమైంది.చివరిగా 2006 లో జరిగింది.తిరిగి ఇప్పుడు ఈ ఏడాది ఆగస్టు నెలలో ప్రారంభమవుతోంది.

అష్ట బంధన కార్యక్రమంఇతర ఆలయాల్లో మాదిరి ఆలయం లోపలికి ఇంజనీరింగ్ అధికారులను అనుమతించరు.మహా సంప్రోక్షణంలో మూలవిరాట్ పాదాలు, పద్మపీఠం మధ్యలో అష్ట బంధన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.ఈ బాలాలయ అష్ట బంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని మూడు విభాగాలుగా నిర్వహిస్తారు.మొదటగా మూల విరాట్ లో ఉన్న శక్తిని కుంభంలోకి ఆవాహనం చేస్తారు. శ్రీవారి ఆలయానికి పక్కనే ఉన్న పాత కళ్యాణ మంటపంలో ప్రత్యేకంగా 24 యాగశాలలను ఏర్పాటు చేస్తారు.

స్వామి వారి శక్తిని ఆవాహన చేసిన కుంభాన్ని పెడతారు. మూలవిరాట్ నకు నిత్యం నిర్వహించే పూజా కైంకర్యాలను ఈ కుంభానికి నిర్వహిస్తారు. చివరి రోజున మహా సంప్రోక్షణతో స్వామివారి శక్తిని తిరిగి మూలవిరాట్ లోకి పంపింస్తారు.

ఈ కార్యక్రమంలో మూల విరాట్ లో నూతనంగా శక్తి ప్రతిష్టాపన జరుగుతుందని పెద్దలు చెబుతారు.

English summary
The Astrologer told the story about astabandhana balayana maha samprokshana in Tirumala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X