ఏప్రిల్ లో పంచగ్రహ కూటమితో పులిపంజా చీల్చి సంపన్నులయ్యే రాశులివే!
వేద జ్యోతిషశాస్త్రంలో నవగ్రహాలు నిర్దిష్ట సమయంలో తమ రాశులను మార్చుకుంటూ ద్వాదశ రాశులలో సంచారం చేస్తూ ఉంటాయి. గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేసేటప్పుడు మరికొన్ని గ్రహాలతో కూడా సంయోగం జరుగుతూ ఉంటుంది. ఇక ఒకే రాశిలో రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు సంయోగం జరిగినప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడతాయి.
ఏప్రిల్ లో పంచ గ్రహ కూటమి
ఏప్రిల్ మాసంలో సూర్యుడు, రాహువు, శుక్రుడు, శని, బుధుడు మీనరాశిలో కలువబోతున్నాయి. ఒకటవ తేదీ నుండి ఏప్రిల్ 15వ తేదీ వరకు సూర్య, శుక్ర, శని రాహువు మరియు బుధుడు మీనరాశిలో ఉంటారు. ఇక ఈ సంచారం పంచగ్రహ కూటమిని ఏర్పరుస్తుంది . ఈ పంచగ్రహ కూటమి వల్ల కొన్ని రాశుల వారికి లబ్ధి జరుగుతుంది. ఆ రాశులు ఏమిటో చూద్దాం.

మిధున రాశి
ఏప్రిల్ నెలలో ఏర్పడే పంచగ్రహ కూటమి వల్ల మిధున రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో మిధున రాశి వారు ఏ పని చేసిన సత్ఫలితాలు వస్తాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. కెరీర్లో పురోగతి ఉంటుంది. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. ఆర్థికపరంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబంలో సామరస్యం పెరుగుతుంది. పంచగ్రహ కూటమి మిధున రాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది.
కర్కాటక రాశి
ఏప్రిల్ నెలలో ఏర్పడే పంచగ్రహ కూటమి కారణంగా కర్కాటక రాశి జాతకులు లబ్ధిని పొందుతారు. ఈ సమయంలో వీరు చేపట్టిన ఏ పని అయినా సానుకూల ఫలితాలను ఇస్తుంది. డబ్బు సంపాదించడానికి వీరికి ప్రత్యేకమైన అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. వర్తక వ్యాపారాలు చేసేవారికి శుభప్రదంగా ఉంటుంది పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు ఇది శుభ సమయం. ఆస్తులు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది.
రాహువు, శని గ్రహాల సంయోగం.. వీరికి అఖండ ధనయోగం!
మకర రాశి
ఏప్రిల్ మాసంలో పంచగ్రహ కూటమి కారణంగా మకర రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో మకర రాశి జాతకులు శని బాధల నుంచి విముక్తి పొంది సంతోషంగా జీవిస్తారు. ఆకస్మిక ఆర్థిక లాభాలను పొందుతారు. కెరీర్లో ప్రమోషన్లు అందుకునే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించే అవకాశం ఉంది. మకర రాశి వారికి ఈ సమయం ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. కుటుంబంలో సామరస్యం ఉంటుంది
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications