రాహువు, శని గ్రహాల సంయోగం.. వీరికి అఖండ ధనయోగం!

వేద జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహానికి సముచితమైన స్థానం ఉంటుంది. 2025 సంవత్సరంలో మార్చి నెలలో జరుగుతున్న ముఖ్య గ్రహాల సంచారం, ముఖ్య గ్రహాల సంయోగం వెరసి కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. మార్చి 29వ తేదీన మీనరాశిలోకి శని సంచారం చేయడంతో పాటు అప్పటికే మీనరాశిలో ఉన్న రాహువుతో శని సంయోగం చెందుతాడు.

మీనరాశిలో రాహువు, శని సంయోగం
ఇక మీనరాశిలో రాహువు, శని సంయోగం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. 30 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ కలయిక కొన్ని రాశుల వారి అఖండ ధన యోగానికి కారణమవుతుంది. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

conjunction of Rahu and Saturn brings immense wealth to these zodiac signs

మేష రాశి
శని,రాహువుల సంయోగం కారణంగా మేష రాశి వారికి చాలా లబ్ధి జరుగుతుంది. ఇది మేష రాశి జాతకులకు అదృష్టాన్ని ఇచ్చే కాలం. మేషరాశిలో 12వ స్థానంలో శని రాహువల కలయిక కారణంగా ఈ సమయంలో వీరు ఏ పనులు ప్రారంభించినా విజయవంతంగా పూర్తి చేస్తారు. మేషరాశి జాతకులు ఈ సంవత్సరం అంతా ఆర్థికంగా బలంగా ఉంటారు. వీరి వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది.

వృషభ రాశి
శని, రాహువుల సంయోగం కారణంగా వృషభ రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో వృషభ రాశి వారు జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. మీరు చిరకాల కోరికలు నెరవేరుతాయి. వృషభ రాశిలో 12వ స్థానంలో శని రాహువుతో సంయోగం జరుపుతున్న కారణంగా మీరు చేసే పనిలో పురోగతిని సాధిస్తారు. ఉన్నతాధికారుల నుంచి గుర్తింపు పొందుతారు. నూతన ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఇది వృషభ రాశి వారికి కలిసి వచ్చే కాలం.

తులారాశి
శని, రాహువుల సంయోగం కారణంగా తులా రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో తులా రాశి జాతకులు జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. దాంపత్య జీవితం చాలా బాగుంటుంది. ఆర్థికంగా బలోపేతం అవుతారు. వర్తక వ్యాపారాలు చేసే వారు కూడా లాభాలను పొందుతారు. ఇది తులా రాశి వారికి అదృష్ట సమయం.

కుంభరాశి
శని, రాహు కలయిక కారణంగా కుంభ రాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో కుంభరాశి జాతకులు అన్ని విధాలుగాను శుభప్రయోజనాలను పొందుతారు. వర్తక, వ్యాపారాలు చేసే వారికి ఈ సంవత్సరం బాగుంటుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు కనిపిస్తాయి. నూతన ఆదాయ మార్గాలు కూడా కనిపిస్తాయి. ఇది కుంభ రాశి వారికి సానుకూల ఫలితాలను ఇచ్చే సమయం.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+