12 ఏళ్ల తర్వాత మలుపు తిరగబోతున్న రాశుల జీవితాలు
రాబోయే కొత్త సంవత్సరంలో అనేక గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. సుమారు 12 సంవత్సరాల తర్వాత బృహస్పతి వృషభరాశిలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా 12 రాశులవారిపై బృహస్పతి సంచార ప్రభావం ఉంటుంది. శనిలా ఇది కూడా నెమ్మదిగా సంచరిస్తుంది. దీనివల్ల ఏయే రాశులవారు ప్రభావితమవుతాయో, ఎవరికి ఏవిధంగా కలిసి రానుందో తెలుసుకుందాం.
మేషరాశి: కొత్త ఆదాయ వనరులకు మార్గాలు తెరుచుకుంటాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. వృత్తిలో ఉన్నవారికి, వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు ఆర్థిక పరిస్థితి బాగుంటుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఈ సమయంలో చేసుకునే వ్యాపార ఒప్పందాలు మంచి లాభాలనిస్తాయి.

సింహ రాశి: గతంలో ప్రారంభమై నిలిచిపోయిన పనులన్నీ సులువుగా అవుతాయి. కెరీర్ లో ప్రమోషన్ కు సంబంధించిన కొత్త బాధ్యతలు చేపడతారు. కుటుంబ సభ్యులతో విహార యాత్రకు లేదంటే తీర్థయాత్రకు వెళ్లొచ్చు. మనసు కూడా సంతోషానికి లోనవుతుంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలోపేతమవుతుంది. అధిక సమయాన్ని కుటుంబ సభ్యులతో గడిపేందుకే వినియోగిస్తారు.
మకర రాశి: ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. వ్యాపారస్తులకు విదేశాల నుంచి ఒప్పందాలు లభిస్తాయి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే అనారోగ్యానికి గురవుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. పెండింగ్ లో ఉన్న పనులను పూర్తిచేస్తారు.












Click it and Unblock the Notifications