ఈనెల 31 తర్వాత ఈ రాశులవారికి రాజయోగం
జ్యోతిష్యం ప్రకారం ధనానికి, భాగ్యానికి గురువు కారకుడు. ఆయన అనుగ్రహం ఉంటే నిరుపేదలు కూడా కుబేరులవుతారు.. అదృష్టవంతులవుతారు. రాహువు ఈనెల 31వ తేదీ నుంచి గురువును విడిచి మీనరాశిలోకి ప్రవేశిస్తోంది. దీనివల్ల గురువు మేష రాశిలో ఒంటరిగా మిగిలిపోతాడు. గురువు రాహువుతో కలిసి ఉండటంవల్ల గురు చండాల యోగం ఏర్పడింది. దీనివల్ల గురువు కొన్ని రాశులవారికి శుభ ఫలితాలున్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం.
మేషరాశి
ఈనెల 31 తర్వాత రాజయోగం పడుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంది. అదనపు ఆదాయ మార్గాలద్వారా సంపద ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. అదృష్టం కలిసివస్తుంది. అనారోగ్య ఛాయలు తగ్గుతాయి. రాబడి పెరగడంతోపాటు అధికార యోగం ఉంది.

మిథునరాశి
వీరికి సిరులు కురుస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరగడంతోపాటు స్థిరాస్తులు విలువ అనేకరెట్లు పెరుగుతుంది. కొత్తగా ఆస్తులు కొంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు, రాజకీయ నేతలు, సినిమా రంగానికి చెందినవారు విజయం సాధిస్తారు. వాహన, గృహ సౌకర్యాలతోపాటు దీర్ఘకాలికంగా వేధిస్తున్న అనారోగ్యం నుంచి బయటపడతారు.
సింహరాశి
వీరికి భాగ్య యోగం పడుతుంది. విదేశీ డబ్బును సంపాదిస్తారు. అక్కడకు వెళ్లడానికి మార్గం సుగమం అవుతుంది. ఆదాయం పెంచుకోవడానికి చేసే ప్రతి ప్రయత్నంలోను విజయం సాధిస్తారు. తండ్రివైపు నుంచి ఆస్తి వస్తుంది. కోర్టు, ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంది.
తులరాశి
ఆర్థికంగా లాభాలున్నాయి. జీవిత భాగస్వామికి కూడా అదృష్టం పడుతుంది. అవివాహితులకు సంబంధాలు కుదురుతాయి. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఉద్యోగావకాశాలు రావడంతోపాటు ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి రాబడి బాగా ఉంటుంది. అధికార యోగానికి కూడా అవకాశం ఉంది.
ధనుస్సు
వీరికి ఆర్థికంగా విశేషమైన లాభం ఉంటుంది. ఆర్థిక ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. పిల్లలు లేనివారికి పిల్లలు కలుగుతారు. పెళ్లి ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో రాణిస్తారు. జీవితంలో స్థిరపడతారు.
మీనరాశి
గురువు ధనస్థానంలో ఉన్నాడు. దీనివల్ల ఆదాయం పెరిగి ఆర్థిక పరిస్థితి బలోపేతమవుతుంది. ఇతరులకు మేలు చేస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో ముందుకు సాగుతారు. అదనపు ఆదాయానికి మార్గాలు సుగమం అవుతాయి. జీతభత్యాలు పెరుగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి.












Click it and Unblock the Notifications