30 ఏళ్ల తర్వాత అరుదైన పరిణామం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కినట్లే!
జ్యోతిష్యం ప్రకారం నవ గ్రహాల్లో ప్రతి నెలా కొన్ని గ్రహాలు సంచారం చేస్తుంటాయి. ఇవి ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడం వల్ల కొందరికి శుభ ఫలితాలొస్తే మరికొందరికి ప్రతికూల ఫలితాలు వస్తాయి. 30 సంవత్సరాల తర్వాత అరుదైన పరిణామం చోటు చేసుకోబోతోంది. కుంభరాశిలో శుక్రుడు, శని కలయిక జరగబోతోంది. వచ్చే ఏడాది జనవరి 22న ఈ రెండు గ్రహాల సంయోగం జరగనుంది. దీనివల్ల నాలుగు రాశులవారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి.
మేష రాశి
ఈ రాశివారికి ధనలాభం ఉంది. కెరీర్ పరంగా మంచి ఫలితాలను సాధిస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. కొన్ని శుభవార్తలను వింటారు. వ్యాపారస్తులకు మంచి ఆర్డర్లు రావడంతో భారీ లాభాలను కళ్లచూస్తారు. విద్యార్థులకు వారి శ్రమను బట్టి ఫలితం లభిస్తుంది.

వృషభ రాశి
వీరు చేసే పనుల్లో మంచి పురోగతి ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వస్తుంది. అలాగే వ్యాపారస్తులకు భారీస్థాయిలో లాభాలున్నాయి. కుటుంబ జీవితం సంతోషంగా గడుస్తుంది. విద్యార్థులు విజయం సాధిస్తారు. వైవాహిక జీవితంలో ఆనందాన్ని చవిచూస్తారు.
మిథున రాశి
ఈ రాశివారు అనేక ప్రయోజనాలను దక్కించుకుంటారు. ప్రతి రంగంలోను విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు లేదంటే తీర్థయాత్రకు వెళ్లొచ్చు. శుక్రుడు, శని కలయిక సమయంలో పూర్వీకులకు తర్పణం చేయడంవల్ల ఎంతో మేలు కలుగుతుంది.
సింహ రాశి
ఈ రాశి నుంచి శుక్రుడు, శని కలయిక ఏడో స్థానంలో జరుగుతుంది. ఈ సమయంలో సింహ రాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. జీవిత భాగస్వామికి తగిన గౌరవం ఇవ్వాలి. ఆరోగ్యాన్ని రక్షించుకోవాలి. వ్యాపార భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి.












Click it and Unblock the Notifications