సంక్రాంతి ముగిసింది... ఈ రాశులవారు నక్కతోక తొక్కినట్లే
కొత్త సంవత్సరంలో మకర సంక్రాంతి పండగ పూర్తయింది. పండగ తర్వాత నుంచి కొన్ని రాశులవారికి పట్టిందల్లా బంగారమే కానుంది. కుంభరాశిలో శని, ధనుస్సులో బుధుడు, కుజుడు, మకరరాశిలో సూర్యుడు ఉంటారు. దీనివల్ల ఈ పండగను ఎంతో పవిత్రంగా భావిస్తారు. జ్యోతిష్యం ప్రకారం మకర సంక్రాంతి వల్ల కొన్ని రాశులవారు అదృష్టవంతులవుతారు. రాశిచక్రం ప్రకారం ఏయే రాశులవారికి బాగా కలిసిరానుందో తెలుసుకుందాం.
మేషరాశి: సూర్యుడి రాశి మార్పు వీరికి బాగా కలిసివస్తుంది. ఆర్థికంగా పటిష్టమవుతారు. ఆర్థిక కోణం కూడా చాలా బలీయంగా ఉంటుంది. కుటుంబ జీవితంలో మాధుర్యాన్ని, సంతోషాన్ని చవిచూస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనులన్నీ విజయవంతమవుతాయి.

మిథునరాశి: మిథునరాశి వారికి ఈ సమయం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. కొత్త పనిని ప్రారంభించడానికి మంచి తరుణం ఇదే. పనిలో విజయం సాధిస్తారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. లాభాలుంటాయి. వైవాహిక జీవితంలోని మాధుర్యాన్ని, సంతోషాన్ని చవిచూస్తారు.
సింహరాశి: ఆర్థికంగా లాభపడతారు. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు దొరుకుతుంది. విద్యారంగానికి సంబంధించినవారికి ఈ సమయం బాగా కలిసివస్తుంది. వ్యాపారంలో లాభాలున్నాయి. నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం ఆలస్యం చేయవద్దు. వివాహం కుదిరే అవకాశం ఉంది.
కన్యారాశి: ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలున్నాయి. భూమి, ఆస్తికి సంబంధించిన విషయాలు పరిష్కారమవడంతోపాటు ఇంటిని లేదంటే స్థలాన్ని లేదంటే కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు మంచి సమయం. మీ పనిని మెచ్చుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలున్నాయి.












Click it and Unblock the Notifications