ఈరోజు నుంచి ధన రాజయోగం.. వీరు పట్టిందల్లా ప్లాటినమే
జ్యోతిష్యం ప్రకారం బుధుడు, శని ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. ఈ రెండు గ్రహాలు ధన రాజయోగాన్ని ఏర్పరుస్తాయి. దీనివల్ల కొందరికి మహర్దశ యోగం ఉంటుంది. సెప్టెంబరు 18వ తేదీ నుంచి (నేటినుంచి) ఏర్పడనున్న ధన రాజయోగంతో అన్ని రాశులపై ప్రభావం ఉన్నప్పటికీ మూడు రాశులవారికి మాత్రం విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. ఆకస్మిక ధనలాభంతోపాటు అదృష్టం తోడుంటుంది. ఉద్యోగులకు, వ్యాపారస్తులకు ఇది అనువైన సమయం. ఆరోగ్య పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవి మినహా ఎటువంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం లేదు.
వృషభరాశి: ఈ రాశివారికి అత్యంత లాభాలు కలగనున్నాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వేతనం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఊహించని లాభాలుంటాయి. వీరు పెద్ద పెద్ద ఒప్పందాలను కుదుర్చుకుంటారు. ఆదాయం పెరగడంవల్ల జీవితం సజావుగా సాగుతుంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి.

తుల రాశి: అన్ని విషయాల్లో వీరికి విజయం వరిస్తుంది. నిల్వ ఉన్న డబ్బులు పెరుగుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడులను ఇప్పుడు మంచి లాభాలను అందిస్తాయి. వ్యాపారస్తులకు అనువైన సమయం. వీరు లాభాలు ఆర్జిస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే డబ్బులకు వీరికి ఎటువంటి కొదవ ఉండదు.
మేష రాశి: ఈ రాశివారికి ఊహించని లాభాలుంటాయి. విద్యార్థులకు బాగుంటుంది. సంతానం విషయంలో ఆనందం వెల్లివిరుస్తుంది. సోదరి, సోదరుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థికంగా ఎటువంటి సమస్య ఎదురవదు. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ తోపాటు పదోన్నతి కూడా లభిస్తుంది.












Click it and Unblock the Notifications