దీపావళి నుంచి ఈ రాశులవారు పట్టిందల్లా బంగారమే
రాహువు, కేతువు, శని అంటే అందరూ భయపడతారు. కానీ ఈ గ్రహాలు మంచి ఫలితాలను కూడా ఇస్తాయనే విషయాన్ని తెలుసుకోరు. దీపావళి 10వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోంది. 12వ తేదీన పండగను జరుపుకుంటారు. దీపావళికి ముందు రాహువు, కేతువు, శని సంచారం జరపబోతున్నాయి. దీపావళికి ఈ గ్రహాల ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. దీపావళి రోజున నాలుగు రాశులవారికి శుభం కలగనుంది. వాటి వివరాలు తెలుసుకుందాం.
మేష రాశి
లక్ష్మీ దేవి అనుగ్రహం ఉండటంతో ఆర్థిక ప్రయోజనాలున్నాయి. ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా గడుస్తుంది. జీవిత భాగస్వామి నుంచి ఊహించని రీతిలో మద్దతు దొరుకుతుంది. ఆదాయం పెరగడంవల్ల కుటుంబంలో కూడా గౌరవాన్ని పొందుతారు. ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి పురోగతి ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఉంది.

వృషభ రాశి
ఇల్లు లేదంటే కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు. విద్యారంగంలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణమైన మద్దతు దొరుకుతుంది. విద్యకు సంబంధించి చేసే పనులు సంతోషాన్ని కలిగిస్తాయి. పిల్లలవైపు నుంచి ప్రయోజనం ఉంది. ఆధ్యాత్మిక పరమైన వాతావరణం ఇంట్లో నెలకొంటుంది. తీర్థయాత్రలకు వెళతారు.
మిథున రాశి
మనశ్శాంతిని పొందుతారు. వ్యాపార రీత్యా లేదంటే ఉద్యోగ రీత్యా మరో ప్రదేశానికి వెళతారు. పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆదాయం పెరగడంవల్ల ప్రగతికి బాటలు వేస్తారు. కూడబెట్టిన సంపద విలువ కూడా పెరుగుతుంది. స్నేహితుల నుంచి పూర్తిస్థాయిలో మద్దతు లభిస్తుంది.
సింహ రాశి
విదేశీ ప్రయాణాలకు అవకాశం కనపడుతోంది. ఉద్యోగంలో మార్పులుంటాయి. మనసుకు శాంతి, సంతోషం కలుగుతాయి. పిల్లలవల్ల ఆనందం వస్తుంది. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. కుటుంబంలో తల్లి నుంచి లేదంటే వృద్ధుల నుంచి డబ్బులు వస్తాయి. ఉద్యోగంలో పై అధికారుల మద్దతు దొరుకుతుంది. ఉద్యోగం చేసే స్థలం కూడా మారే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications