బృహస్పతి తిరోగమనంతో ఈ రాశులవారిపై కనక వర్షం
జ్యోతిష్యం ప్రకారం అదృష్ణానికి, మేథస్సుకు, సంతానానికి గురుడు కారకుడు. ఏ వ్యక్తి జాతకంలో బృహస్పతి శుభస్థానంలో ఉంటాడో వారికి దేనికీ లోటుండదు. సంవత్సరానికొకసారి గురుడు తన రాశిని మారుస్తుంటాడు. ఈ ఏడాది ఏప్రిల్ లో బృహస్పతి మేషరాశిలోకి ప్రవేశించాడు. సెప్టెంబరు నాలుగోతేదీన తిరోగమనం చేయనున్నాడు. ఈ తిరోగమన కదలిక మూడు రాశులవారికి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని తెస్తోంది. ఆ లక్కీ రాశుల వివరాలు తెలుసుకుందాం.
ధనుస్సు: ఈ రాశివారికి గురుడి తిరోగమన కదలిక అదృష్టాన్ని తేబోతోంది. ప్రధానంగా వీరి ఆదాయం పెరుగుతుంది. ఆదాయ మార్గాలు దొరుకుతాయి. సంతానం లేనివారికి పిల్లలు కలుగుతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎక్కువ ప్రయోజనం పొందుతారు. ప్రేమ జీవితం బాగుంటుంది. లగ్జరీ జీవితాన్ని లీడ్ చేస్తారు. కోరుకున్న కోరికలన్నీ నెరవేరతాయి. కుటుంబ సభ్యుల నుంచి ఊహించని రీతిలో మద్దతు దొరుకుతుంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది.

కర్కాటక రాశి: ఈ రాశివారికి పలు ప్రయోజనాలు కలగనున్నాయి. కెరీర్ లో అభివృద్ధికి ఆటంకంగా ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి ఉద్యోగం దొరుకుతుంది. ఉద్యోగం మారాలనుకునేవారి కోరిక కూడా నెరవేరుతుంది. కుటుంబ సభ్యులతో గడపడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. వారి నుంచి మీకు సంపూర్ణ సహకారం అందుతుంది. ఏ పని తలపెట్టినా జీవిత భాగస్వామికి చెప్పి చేయడంవల్ల ఆ పని విజయవంతంగా జరుగుతుంది. వ్యాపారస్తులు పెద్ద పెద్ద ఒప్పందాలను కుదుర్చుకుంటారు. గతం నుంచి కొనసాగుతున్న వివాదాలన్నీ ఈ సమయంలో పరిష్కారమవుతాయి.
మేష రాశి: బృహస్పతి ఈ రాశిలోనే తిరోగమనం చెందుతున్నాడు. దీనివల్ల అదృష్టం వీరి వెంటే ఉంటుంది. ఆకస్మికంగా ధన లాభం ఉంటుంది. డబ్బును పొదుపు చేస్తారు. వ్యక్తిత్వం మెరుగు పడుతుంది. మాట్లాడే మాటలను అదుపులో ఉంచుకుంటే విజయం మీదే అవుతుంది. కెరీర్ లో పురోగతి ఉంది. అందుకు గతం నుంచి కొనసాగుతున్న ఆటంకాలు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి కలుగుతుంది. మతపరమైన వాటిల్లో పాల్గొంటారు. టోటల్ గా ఈ సమయం వీరికి చాలా అనుకూలంగా ఉంది.












Click it and Unblock the Notifications