వృశ్చికంలో బుధుడు.. ఈ రాశులవారు విమానంలో రయ్.. రయ్..
బుధుడు ఈరోజు వృశ్చికరాశిలోకి సంచరిస్తున్నాడు. దీనివల్ల కొన్ని రాశులవారికి శుభ ఫలితాలు, మరికొన్ని రాశులవారికి ప్రతికూల ఫలితాలు ఎదురు కానున్నాయి. జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. బుధుడు వృశ్చికరాశిలోకి ప్రవేశించిన తర్వాత ఏయే రాశులవారికి ఏ విధంగా కలిసి రానుందో తెలుసుకుందాం.
మేష రాశి: మేషరాశివారికి అంతా బాగుంటుంది. ఆత్మవిశ్వాసం పెరిగి పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. అయితే కొన్ని కొన్ని విషయాల్లో ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వ్యాపారాలు చేసేవారికి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. జీవిత భాగస్వామి సలహాలు, సంప్రదింపులతో తలపెట్టిన పని పూర్తవుతుంది.

వృషభ రాశి: చిన్న చిన్న ఇక్కట్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనివల్ల మనసు కలత పడుతుంది. తెలియని భయంతో ఇబ్బందులు పడతారు. సంగీతం లేదంటే కొన్ని కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్త అవసరం. దీన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం ముంచుకొస్తుంది.
మిథున రాశి: మిథున రాశి వారికి ఈ సమయం మనసు చాలా ఆనందంగా ఉంటుంది. అంతేకాకుండా వీరికి ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది. దీని కారణంగా అనేక విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి పురోగతి కూడా లభిస్తుంది. ఆదాయం పెరిగి వ్యాపారాల్లో పెట్టుబడులు కూడా పెడతారు.
కర్కాటక రాశి: మనసులో శాంతి నెలకొని సంతోషం పెరుగుతుంది. దీనివల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగంలో పురోగతి లభించి, వేతనాలు పెరిగే అవకాశాలున్నాయి. పై అధికారుల మద్దతు లభించి పనులమీద విదేశాలకు వెళ్లే ఛాన్స్ లు కనపడుతున్నాయి.
సింహరాశి: మనసు ఆనందమయంగా మారుతుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో గడపడానికే అధిక సమయాన్ని వెచ్చిస్తారు.












Click it and Unblock the Notifications