సూర్య భగవానుడి స్థాన చలనం.. ఈ రాశులవారు పట్టుకుందల్లా బంగారమే
జ్యోతిష్యలో సూర్యుడిని గౌరవానికి ప్రతీకగా భావిస్తారు. ఎవరి జాతకంలో భానుడు బలంగా ఉంటాడో వారు వివిధ రకాల సౌఖ్యాలతో ఉన్నత స్థానాలను పొందుతారు. బలహీనంగా ఉంటే రోజువారి జీవితంలో కూడా పలు సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. ప్రతినెలా సూర్య భగవానుడు రాశి చక్రాన్ని మారుస్తుంటాడు.
ఈ ప్రభావం మొత్తం 12 రాశులపై ఉంటుంది. ఈనెల 17వ తేదీన రవి సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల కొన్ని రాశులవారు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అలాగే కన్య, వృశ్చిక, మకర రాశులవారికి వారు పట్టుకున్నదల్లా బంగారం అవుతుంది.

కన్య రాశి: ఆరోగ్యం విషయంలో ఈ రాశులవారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులకు అనుకోకుండానే డబ్బు చేతికి వస్తుంది. గతంలో ప్రారంభమై పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. సొంత ఇల్లు కొనుగోలు చేయడంతోపాటు వ్యాపార రంగంలో బాగా రాణిస్తారు.
వృశ్చిక రాశి: మానసిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. సమయాన్ని బట్టి సమస్యలన్నీ వాటంతటవే పరిష్కారమవుతుంటాయి. విదేశీ యానానికి అవకాశం కనపడుతోంది. ఉద్యోగంలో పదోన్నతి పొందుతారు. దీనివల్ల రాబడి పెరుగుతుంది.
మకర రాశి: ఈ రాశులవారు వాహనాలు నడిపే సమయంలో అత్యంత జాగరూకతతో ఉండాలి. అవివాహితులకు పెళ్లి సంబంధాలు కుదురుతాయి. రాదనుకున్న డబ్బు సమయానికి చేతికి అందుతుంది. దీనివల్ల చిన్న చిన్న ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతారు.
కొన్నిరకాల పరిహరాలు పాటిస్తే వీరు మరిన్ని శుభఫలితాలను పొందడానికి అవకాశం ఉందని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. సోమవారం పరమేశ్వరుడి ఆలయానికి వెళ్లాలి. అక్కడ రావి చెట్టుకింద దీపం పెట్టి, చీమలకు పంచదార వేయాలని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications