మూడు ప్రధాన గ్రహాల తిరోగమనం.. ఈ రాశులవారికి ఎన్నడూ కళ్ల చూడనంత డబ్బు
సంతోషానికి, సంపదకు బృహస్పతి సూచిక. ఈనెల నాలుగో తేదీ నుంచి గురువు 118 రోజులపాటు తిరోగమనదిశలో ఉండబోతున్నాడు. ఇప్పటికే బుధుడు, శని కూడా సంచారంలో ఉన్నాయి. ఈ ప్రభావంవల్ల కొన్ని రాశులవారిపై సానుకూలత ఉండగా, మరికొన్ని రాశులవారిపై ప్రతికూల ప్రభావం పడుతోంది. దీనివల్ల వృషభం, ధనస్సు, కన్యా రాశులవారికి ఊహించనిరీతిలో ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర పండితులు తెలియజేస్తున్నారు.
కన్య రాశి: ఈ రాశివారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఆర్థికంగా గతంలో ఎన్నడూ లేనిస్థాయిలో లాభాలను చూస్తారు. వ్యాపారస్తులకు 118 రోజులు చాలా కీలకం. అనారోగ్య సమస్యల నుంచి ఈ సమయంలో బయటపడతారు. జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో గడపడానికి అధిక సమయాన్ని వెచ్చిస్తారు.

వృషభ రాశి: జీవితంలో వీరికి అనేక మార్పులు జరుగుతాయి. ఉద్యోగంలో ఉన్నవారు కొత్త బాధ్యతలు చేపడతారు. పూర్వీకుల ఆస్తి నుంచి ప్రయోజనం దక్కనుంది. వ్యాపారస్తులకు ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంది. కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి, సరికొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ఇది అనుకూల సమయం. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు.
ధనుస్సు రాశి: ఈ రాశివారి జీవితాల్లో అనేక మార్పులు చోటుచేసుకోనున్నాయి. వ్యాపారాల్లో కూడా భారీ లాభాలను కళ్లజూస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. విదేశీ పర్యటనలు చేసే అవకాశం కనపడుతోంది. విద్యార్థులకు ఇతర దేశాల్లో విద్యనభ్యసించేందుకు అవకాశం లభిస్తుంది. వారి కోరిక నెరవేరుతుంది. అలాగే పోటీ పరీక్షల్లో కూడా సులువుగా విజయం సాధిస్తారు.












Click it and Unblock the Notifications