వక్రంలో శని... ఈ రాశులవారు ఐశ్వర్యవంతులు

నవగ్రహాలలో శనిదేవుడిని ప్రధాన గ్రహంగా పరిగణిస్తారు. వ్యక్తుల చర్యలకు, కర్మలకు అనుగుణంగా ప్రతిఫలమిస్తాడు. కర్మలను ప్రసాదించే ధర్మశీలి శని భగవానుడు అని అందరూ విశ్వసిస్తారు. ప్రస్తుతం ఆయన వక్రస్థానంలో సంచరిస్తున్నాడు. జూన్ 17వ తేదీన ఆయన వక్ర గమనంలోకి వెళ్లాడు. నవంబరు నాలుగో తేదీ వరకు అక్కడే సంచరిస్తాడు. దీనివల్ల కొన్ని రాశులవారు ప్రయోజనాలను పొందబోతున్నారు. వారెవరనేది? ఏ విధంగా లాభపడనున్నారనేది తెలుసుకుందాం.

వృషభ రాశి
శని సంచారం ఈ రాశివారికి ఎన్నో లాభాలను సమకూర్చనుంది. వీరి కోరికలన్నింటినీ శని భగవానుడు తీరుస్తాడు. వృత్తి, ఉద్యోగంతోపాటు వ్యాపారంలో ఉన్నవారు కూడా మంచి పురోగతి సాధిస్తారు. మంచి మంచి అవకాశాలు వస్తాయి. కార్యాలయంలో ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ పొందుతారు. జీవిత భాగస్వామితో ఉన్న అనుబంధం బలపడుతుంది.

these zodiac

సింహ రాశి
శని భగవానుడు వీరికి అదృష్టాన్ని తీసుకురాబోతున్నాడు. కుటుంబ జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరగడంతోపాటు వీరి మధ్య అనుబంధం బలపడుతుంది. ధనంతోపాటు వస్తు సంపద పెరుగుతుంది. ఆర్థికంగా పురోగతి ఉండటంతో బలపడతారు. నగదు ప్రవాహంలో ఎటువంటి తగ్గుదల ఎదురుకాదు.

కుంభ రాశి
కుంభరాశివారికి శనిదేవుడు అనుకూలమైన పరిస్థితులను కల్పించబోతున్నాడు. దీనివల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనే శక్తి కలుగుతుంది.రుణానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. ఆర్థికంగా మంచి పురోగతి ఉంటుంది. మంచి మంచి అవకాశాలు వస్తాయి. వృత్తి, వ్యాపారంతోపాటు ఉద్యోగంలో ఉన్నవారు మంచి పురోగతిని సాధిస్తారు. వీరికి కూడా నగదు ప్రవాహంలో ఎటువంటి లోటు ఏర్పడదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+