ఈ ఏడాది మొత్తం ఈ రాశులవారికి మహా రాజయోగం
పురాణాల ప్రకారం శని సూర్యుడి కుమారుడు. కర్మలను బట్టి ఫలాలను ఇస్తాడు కాబట్టి శనిదేవుడిని న్యాయదేవుడు అంటారు. కర్మదాత అని కూడా పిలుస్తారు.
ప్రస్తుతం కుంభరాశిలో సంచారం చేస్తున్న శని 2025 వరకు ఇక్కడే ఉంటాడు. జనవరి 11న శని శతిభిషా నక్షత్రంలోకి ప్రవేశించాడు. శని సంచారం, నక్షత్ర రాశి మార్పు వల్ల మూడు రాశులవారికి ఎంతో బాగుంటుంది. వాటి వివరాలను తెలుసుకుందాం.
ధనస్సు రాశి : ఈ రాశివారికి శని సంచారం బాగా కలిసివస్తుంది. పనిచేసేచోట గౌరవాన్ని పొందుతారు. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఈ సమయంలో చేసే ఇన్వెస్ట్ మెంట్ లాభదాయకంగా మారుతుంది. శుభవార్త వింటారు. అన్ని సమస్యల నుంచి బయటపడటంతోపాటు ఉద్యోగం లేనివారికి ఉద్యోగం దొరుకుతుంది. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్నవారికి ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ కూడా లభిస్తుంది.

కర్కాటక రాశి : శని సడేసతి, దైయా ముగిసిద్ది. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగం కోసం ఎదురుచూసేవారి కోరిక తప్పనిసరిగా నెరవేరుతుంది. ప్రమోషన్ వస్తుంది. కోడళ్లకు అత్తమామల పోరు తప్పిద్ది. వ్యాపారం వృద్ధి చెందడంతోపాటు మంచి పేరును తెచ్చిపెడుతుంది. వైవాహిక జీవితంలో ఆనందాన్ని, మాధుర్యాన్ని చవిచూస్తారు.
తులారాశి : శని సంచారం ఈ రాశివారికి బాగా కలిసి వస్తుంది. కెరీర్ లో వీరు ఉన్నతస్థాయికి చేరుకుంటారు. విద్యార్థులు రాణిస్తారు. ప్రేమ వ్యవహారం పెళ్లికి దారితీస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం దొరుకుతుంది. దాంపత్య జీవితంలో ఆనందం, సంతోషం వెల్లివిరుస్తాయి. సంతానం కలుగుతుంది. పేదరికం నుంచి సులువుగా బయటపడతారు.












Click it and Unblock the Notifications