2025 వరకు ఈ రాశులవారికి తిరుగులేదు
శని నెమ్మదిగా కదులుతుంటాడు. ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించడానికి దాదాపు రెండున్నర సంవత్సరాల సమయం పడుతుంది. ఈ ఏడాది ప్రారంభంలో కుంభరాశిలోకి ప్రవేశించాడు. 2025 వరకు ఇక్కడే ఉంటాడు. మనం చేసే మంచి, చెడు పనులనుబట్టి శని ఫలితాలనిస్తుంటాడు. అందుకే ఆయన్ని కర్మదాత, న్యాయదేవుడు అని పిలుస్తారు. శని అనుగ్రహం ఉంటే బిచ్చగాడు కూడా బిలియనీర్ అవుతాడు. రెండున్నర సంవత్సరాల పాటు శని కుంభరాశిలో ఉండటం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం.
కుంభ రాశి:శష్ అనే రాజయోగం ఏర్పడుతుంది. దీనివల్ల వ్యక్తిత్వం మెరుగవుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి నుంచి ఊహించని రీతిలో మద్దతు లభిస్తుంది. కోర్టు కేసుల్లో విజయం దక్కుతుంది. డబ్బును బాగా పొదుపు చేస్తారు.

మిథునరాశి:శని సంచారం వీరికి వరం లాంటిది. ప్రతి పనిలో అదృష్టం తోడుండటంవల్ల విజయాలు సాధిస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఉంది. పనిచేసేచోట ఎంతో అనుకూలత ఏర్పడుతుంది. విదేశాలకు వెళతారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. కుటుంబ సభ్యులతో గడపడానికి అధిక సమయాన్ని వెచ్చిస్తారు.
తులారాశి:పెళ్లి కానివారికి పెళ్లి కుదురుతుంది. సంతానం లేనివారికి సంతానం కలుగుతారు. స్టాక్ మార్కెట్, లాటరీ, బెట్టింగ్ లో పెట్టుబడివల్ల లాభాలను పొందుతారు. వాహనం లేదంటే ఆస్తిని కొనుగోలు చేస్తారు. తల్లిదండ్రుల నుంచి మద్దతు దొరుకుతుంది.












Click it and Unblock the Notifications