పశ్విక యోగంతో ఈ రాశులవారి జీవితం అల్లకల్లోలం
జ్యోతిష్యాన్ని కొంతమంది నమ్ముతారు. మరికొంతమంది అంతగా పట్టించుకోరు. మన రాశులను బట్టి గ్రహాల ప్రభావం ఉంటుంది. ఈ ప్రభావంవల్ల కొన్ని రాశులకు మంచి జరిగితే మరికొన్ని రాశులకు అశుభ ఫలితాలు ఎదురవుతాయి. గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు సంవత్సరానికి ఒకసారి ఒక్కోరాశిలో సంచరిస్తుంటాడు. ా సంచారంలో భాగంగా ఈనెల 16న కర్కాటకరాశిలోకి ప్రవేశించాడు. దీనివల్ల పశ్విక యోగం ఏర్పడింది. ఇది చాలా అశుభకరమైందిగా జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఈ యోగంవల్ల ధన నష్టంతోపాటు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఏయే రాశులవారికి పశ్విక యోగంవల్ల అనర్థాలు కలుగుతాయో తెలుసుకుందాం.
ధనుస్సు రాశి : ఈ రాశివారికి పశ్విక యోగం ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. పిల్లలు పుట్టకపోవడంవల్ల భార్యాభర్తల మధ్య వివాదాలు తలెత్తుతాయి. మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. అయితే ఆకస్మిక ధన లాభం ఉంది.

మిథునరాశి : మిథునరాశివారికి పశ్విక యోగం హానికరం. ఈ సమయంలో కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణిస్తుంది. దాంపత్య జీవితంలో వివాదాలు తలెత్తుతాయి. చేసే పనిని శ్రద్ధగా చేయాలి. ఏమాత్రం అలసత్వం వహించినా నష్టం జరుగుతుంది.
కన్యారాశి : పశ్వికయోగం వల్ల కన్యారాశివారికి తీవ్ర ఇక్కట్లు కలుగుతాయి. వ్యాపారస్తులకు వారి సంబంధాలు చెడిపోతాయి. అలాగే వ్యాపార భాగస్వామితో వివాదాలు తలెత్తుతాయి. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి.
ఈనెల 25వ తేదీన బుధుడు సింహరాశిలో ప్రవేశిస్తుండటంవల్ల స్థానికుల జీవితంలో పెనుమార్పులు చోటుచేసుకుంటాయి. గ్రహాలకు రాకుమారుడిగా భావించే బుధుడు వృత్తి, వ్యాపారంతోపాటు ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేస్తుంటాడు. సూర్యుడి రాశిలో మెర్క్యురీ సంచారం వల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది. ప్రధానంగా దీనివల్ల వృషభ, తుల, మకర రాశులవారికి అంతా కలిసిరానుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.












Click it and Unblock the Notifications