Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమావాస్య ముగిసింది.. ఈ రాశులకు మహర్దశ

వైదిక పంచాంగం ప్రకారం అమావాస్య మంగళవారం రాత్రి 11.00 గంటలకు ప్రారంభమై బుధవారం రాత్రి 8.41 గంటలకు ముగుస్తుంది. జ్యోతిష్యం ప్రకారం అమావాస్య రోజు ఎన్నో అరుదైన యోగాలున్నాయి. వీటి ప్రభావం భూమిపై ఉన్న అన్ని జీవులపై ఉంటుంది. వైశాఖ అమావాస్య రోజు ఏ శుభ యోగాలున్నాయి, అమావాస్య ముగిసిన తర్వాత వారికి ఎలా కలిసి రాబోతోంది అనే విషయాలను తెలుసుకుందాం.

మూడు యోగాలున్నాయి
వైశాఖ మాసంలోని అమావాస్య తిథి నాడు శోభన్ యోగ, సౌభాగ్య యోగ , సర్వార్థ సిద్ధి యోగ అనే మూడు యోగాలు సంభవించాయి. సర్వార్థ సిద్ధి యోగం మే 8న తెల్లవారుజామున 1:35 గంటలకు ప్రారంభమై తర్వాత రోజు ఉదయం 5:30 గంటలకు ముగిసింది. సౌభాగ్య యోగం 7వ తేదీ రాత్రి 9 గంటలకు ప్రారంభమై 8వ తేదీ సాయంత్రం 5:30 గంటలకు ముగిసింది. సౌభాగ్య యోగం ముగిసిన తర్వాత షోమన్ యోగం ఉంటుంది. సూర్యోదయం తర్వాత ఇది ముగిసింది.

these zodiac sign people very lucky due to vaishakh amavasya horoscope

ఆర్థికంగా కలిసివస్తుంది
అమావాస్యలో సంభవించే మూడు శుభ సంయోగాల కారణంగా మేషం, వృషభం , తులా రాశి వ్యక్తులకు అదృష్టం కలిసివస్తుంది. అమావాస్య తర్వాత ఈ మూడు రాశుల వారికి వ్యాపారంలో విపరీతమైన లాభాలున్నాయి. కెరీర్‌కు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారమవడంతోపాటు మంచి స్థాయి లభిస్తుంది. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం చోటుచేసుకుంటుంది. జీవితం సంతోషంగా గడుస్తుంది. తల్లిదండ్రుల నుంచి ఆర్థిక ప్రయోజనాలున్నాయి.

జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో కచ్చితంగా విజయం లభిస్తుంది. వైవాహిక జీవితంలోని మాధుర్యాన్ని చవిచూస్తారు. ఉద్యోగస్తులు మంచి విజయాన్ని సాధిస్తారు. పనిచేసేచోట కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. వీటిని గొప్పగా నిర్వహిస్తారు. సహోద్యోగుల నుంచి, సీనియర్ల నుంచి పూర్తి సహకారం అందుతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+