8న సూర్యగ్రహణం.. ఈ రాశులవారికి దరిద్రం పట్టుకుంటుంది
జ్యోతిష్యం ప్రకారం గ్రహాలు నక్షత్రాలను మార్చినప్పుడు గ్రహణాలు ఏర్పడుతుంటాయి. ఈ ఏడాది మొదటి సూర్య గ్రహణం ఏప్రిల్ 8న ఏర్పడుతుంది. గ్రహణం సంభవించడానికి ముందే కొన్ని రాశులవారికి ప్రతికూల పరిణామాలు ఎదురుకానున్నాయి. ఏయే రాశులవారు ఇటువంటి ప్రతికూలతలను ఎదుర్కొననున్నారో తెలుసుకుందాం.
వృశ్చిక రాశి
ఈ రాశివారి జీవితంలో అనేక ఇక్కట్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యాపారస్తులకు ఒడిదుడుకులున్నాయి. పని ఒత్తిడి ఎంతో తీవ్రంగా ఉండటంతోపాటు ఈ ఒత్తిడి మనిషి శ్రేయస్సుపై ప్రభావం చూపుతుంది. ఉద్యోగులకు అసలు బాగోదు. కార్యాలయంలో పనిఒత్తిడి పెరగడంవల్ల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. న్యాయపరమైన కేసుల్లో ఏమాత్రం పురోగతి ఉండదు. వ్యాపారంలో పెట్టుబడి నష్టాలకు దారితీసే అవకాశం ఉంది.

ధనుస్సు రాశి
ఈ రాశివారిపై సూర్య గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగాల్లో ఉన్నవారికి ఇబ్బందికరమైన పరిణామాలు ఏర్పడతాయి. ప్రత్యర్థుల నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనివల్ల తీవ్ర ఒత్తిడికి గురవుతారు. ప్రమోషన్ వచ్చే అవకాశాలకు కొందరు అడ్డుపడతారు. దీనివల్ల వీరు నిరాశకు గురవుతారు. వ్యాపారస్తులకు నష్టం వాటిల్లుతుంది.
వృషభ రాశి
పనుల్లో ఆటంకాలున్నాయి. ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వివాహమైనవారి జీవితాల్లో కూడా ఒడిదుడుకులుంటాయి. ఇరుగు పొరుగుతో గొడవలేర్పడతాయి. ఆర్థికంగా నష్టపోవడంతోపాటు కుటుంబంలో వివాదాలు తలెత్తుతాయి. వ్యాపారాల్లో నష్టం ఉంది. ఇవన్నీ కలిసి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. గ్రహణ సమయంలో వీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటక రాశి
వ్యాపారంలో ఉన్నవారికి భారీనష్టాలున్నాయి. ఖర్చులను తగ్గించుకోవాలి. మానసిక ఒత్తిడికి గురవడంవల్ల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. నిరాశకు గురవుతారు.
తుల
సమస్యలు చుట్టుముడతాయి. వ్యాపారంలో కొత్త ప్రయత్నాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం దెబ్బతింటుంది. మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతాయి. కుటుంబంలో శాంతి ఉండదు. వృత్తిపరంగా కూడా నిరాశ తప్పదు.












Click it and Unblock the Notifications