కేంద్ర త్రికోణ రాజయోగం.. ఈ రాశులవారికి మహాయోగం

బుధుడు మార్చి 26న మీనరాశిని వదిలిపెట్టి మేషరాశిలకి ప్రవేశించాడు. ఈనెల తొమ్మిదోతేదీ వరకు తిరోగమన స్థితిలో ఉండి అదేరోజు సాయంత్రం మీనరాశిలోకి వెళతాడు. తిరిగి పదోతేదీన మేషరాశిలోకి వస్తాడు. బుధుడు మేషరాశిలో ఉంటే కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది.

దీనివల్ల కొన్ని రాశులవారు సానుకూలమైన ఫలితాలు పొందుతారు. కెరీర్ లో విజయాలు అందుకోవడంతోపాటు వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. ఈ ప్రభావం ఆయా రాశులపై ఏవిధంగా ఉంటుందో తెలుసుకుందాం.

these zodiac signs are very lucky due to kendra trikona rajayoga in aries

వృషభ రాశి
పై అధికారుల నుంచి గౌరవం అందుకుంటారు. వేతనాలు పెరుగుతాయి. విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు ఇది మంచి సమయం. సమాజంలో పేరు ప్రతిష్టలు కలుగుతాయి. సరైన రీతిలో పెట్టుబడి పెడితే భవిష్యత్తులో మంచి ఫలితాలు రావడంతోపాటు ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడుతుంది.

కన్యా రాశి
ఆర్థికంగా బలోపేతమవుతారు. దూరప్రయాణాలు లాభాలనిస్తాయి. కొత్త వ్యక్తులు స్నేహితులవుతారు. వృత్తిలో స్థిరత్వం ఉంది. పెండింగ్ పనులు ఈ సమయంలో పూర్తిచేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళతారు. కుటుంబ సభ్యులతో అనుబంధం బలపడుతుంది. తల్లిదండ్రులనుంచి ఆశీర్వాదం లభిస్తుంది.

తులా రాశి
విదేశీ వ్యక్తులతో ఒప్పందాలున్నాయి. కొత్త పనుల్లో విజయం లభిస్తుంది. ఆర్థికంగా మంచి లాభాలున్నాయి. పెళ్లి కుదురుతుంది. భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది. తెలివితేటలతో తీసుకునే నిర్ణయాలు లాభాలనిస్తాయి. ప్రేమగా ఉండటంవల్ల ఇతరుల హృదయాలను గెలుచుకుంటారు.

మకర రాశి
వాహనం లేదంటే ఆస్తి కొనుగోలు చేస్తారు. వివాదాలు కొలిక్కి వస్తాయి. కుటుంబ జీవితం సంతోషంగా గడుస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. బంధువులతో ఉన్న వివాదాలు పరిష్కారమవుతాయి. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+