కేతువు తిరోగమనంతో ఈ రాశులపై లక్ష్మీదేవి వరాల జల్లు
కేతువు ఎల్లప్పుడూ తిరోగమనంలోనే ఉంటుంది. ప్రస్తుతం కన్యారాశిలో ఉన్న కేతువు 2025 మే నెల వరకు అక్కడే ఉంటుంది. ఈ తిరోగమనంవల్ల కొన్ని రాశులవారికి ధనలాభంతోపాటు అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. మరికొన్ని రాశులవారికి మాత్రం ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయి. కేతువు వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.
మేష రాశి
రాబోయే 11 నెలలు వీరికి అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. ఆర్థిక పరిస్థితులు మారతాయి. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో విజయం సాధిస్తారు. ఇద్దరి మధ్య అనుబంధం బలపడుతుంది. మధురానుభూతికి లోనవుతారు. పెట్టుబడులు పెడుతున్నవారికి మంచి లాభాలున్నాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ప్రధానమైన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. అలాగే ఉద్యోగస్తులకు వారు పనిచేసే చోట ప్రశంసలు లభిస్తాయి.

కర్కాటక రాశి
గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. డబ్బుకు సంబంధించిన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. సమస్యలు రాకుండా, అవి పెద్దవి కాకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం దక్కుతుంది. చిన్న చిన్న సమస్యలు ఎదురవుతున్నప్పటికీ వాటిని పెద్దవి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది.
వృశ్చిక రాశి
వ్యాపారాల్లో ఎదరవుతున్న సమస్యల నుంచి బయటపడతారు. కేతువు అనుగ్రహంతో అన్నీ పరిష్కారమవుతాయి. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒత్తిడి నుంచి సులభంగా ఉపశమనం కలుగుతుంది. గతంలో మొదలై నిలిచిపోయిన పనులను పూర్తిచేయడానికి ఇది మంచి సమయం. పనిమీద శ్రద్ధ పెట్టడంవల్ల వాటిని సాధించగలుగుతారు.












Click it and Unblock the Notifications