రాశిని మారుస్తున్న కుజుడు.. ఈ రాశులు నక్కతోక తొక్కినట్లే

మరో రోజులోనే మార్చి నెల రాబోతోంది. ఎప్పటిలానే ఈ నెలలో కూడా కీలక గ్రహాలు కొన్ని తమ సంచారాన్ని మార్చుకోబోతున్నాయి. ఇలా మార్చుకునేవాటిలో అంగారకుడు కూడా ఒకటి. మార్చి 15వ తేదీన కుజుడు మకర రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అప్పటికే శని దేవుడు కుంభరాశిలో ఉండటంతో వారిద్దరి కలయిక జరగనుంది. కుజుడి రాశి మార్పు వల్ల ఏయే రాశులవారు ఏ ప్రయోజనాలను పొందనున్నారో తెలుసుకుందాం.

కుంభరాశి: ఈ రాశిలోనే కుజుడి సంచారం ఉండటంతో వీరు ఏ పని తలపెట్టినా విజయవంతంగా పూర్తిచేస్తారు. వ్యాపారస్తులు లాభాలను గడించడంతోపాటు జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. మానసికంగా ప్రశాంతతను పొందుతారు. జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభించడంతో ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యులతో లేదంటే స్నేహితులతో కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనకు లేదంటే విహార యాత్రలకు వెళతారు.

these zodiac signs are very lucky due to Mangal Gochar in March 2024

మకరరాశి: అంగారకుడి సంచారం ఈ రాశివారికి విశేష లాభాలను కలిగిస్తుంది. గతం నుంచి వేధిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. రాజకీయాల్లో ఉన్నవారికి ఈ సమయం చాలా బాగుంటుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. వృత్తిరీత్యా లేదంటే వ్యాపార రీత్యా దూర ప్రయాణాలు చేస్తారు. అవి కూడా ఆర్థికంగా కలిసివస్తాయి.

మేష రాశి: కెరీర్ లో ఉన్న అడ్డంకులన్నీ ఈ రాశివారికి తొలగిపోతాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి వారి కోరిక ఫలిస్తుంది. వైవాహిక జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. విదేశీయానం చేయాలనే కోరిక ఉన్నవారి కోరిక కూడా నెరవేరుతుంది.

సింహరాశి: కుజుడి సంచారం ఈ రాశివారికి అద్భుతంగా ఉంటుంది. కెరీర్ పరంగా దూసుకుపోతారు. ఉన్నత శిఖరాలను చేరుకుంటారు. ఆర్థికంగా మంచి స్థితికి చేరుకోవడంతోపాటు నలుగురికి సాయం చేసే స్థితిలో ఉంటారు. అనారోగ్యం నుంచి బయటపడతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+