30 ఏళ్ల తర్వాత అద్భుత కలయిక.. ఈ రాశులవారు నక్క తోక తొక్కినట్లే
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని దేవుడు ప్రస్తుతం కుంభ రాశిలో సంచరిస్తున్నాడు. ఇదే సమయానికి సూర్యుడు కూడా ఇదే రాశిలోకి ప్రవేశించాడు. అరుదైన ఈ పరిణామం ఈనెల 13వ తేదీన చోటుచేసుకుంది. దాదాపు 30 సంవత్సరాల తర్వాత వీరి కలయిక జరిగింది. దీనివల్ల ప్రత్యేక యోగాలు కూడా ఏర్పడుతున్నాయి. మార్చి 13వ తేదీ వరకు ఉండే ఈ ప్రభావంవల్ల కొన్ని రాశులవారికి విపరీతంగా కలిసి రానుంది. వాటి వివరాలను తెలుసుకుందాం.
సింహరాశి
ఈ రాశివారి వైవాహిక జీవితంలో కొనసాగుతున్న విభేదాలు పరిష్కారమవుతాయి. భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది. వ్యాపారస్తులకు తమ పెట్టుబడులను విస్తరిస్తారు. తద్వారా ఆర్థిక పరిస్థితులు మరింత మెరుగవుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. ఇవి కూడా ఆర్థికంగా కలిసి వస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సంతోషాలు వెల్లివిరుస్తాయి.

మిథునరాశి
ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఉంది. గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. వ్యాపారస్తులకు లాభాలతోపాటు ఎటువంటి పనులనైనా వీరు అవలీలగా పూర్తిచేయగలుగుతారు. ఒంటరి జీవితం గడుపుతున్నవారికి ఈ సమయం చాలా కలిసివస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడంతోపాటు చేసే పనులనుబట్టి కీర్తిప్రతిష్టలు వస్తాయి.
మకరరాశి
ఈ రాశివారికి ఈ సమయం ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది. గౌరవం రెట్టింపవుతుంది. ఉద్యోగాలు చేసేవారికి పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. అయితే ఆరోగ్యంపై మాత్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్థికంగా ప్రయోజనాలున్నాయి. కోరుకున్న కోరికలు కూడా నెరవేరతాయి.












Click it and Unblock the Notifications