మిథునరాశిలో సూర్యుడు.. జులై వరకు ఈ రాశులు జమిందారులే
గ్రహాల్లో సూర్యుడు ప్రతి నెలా సంచారం చేస్తాడు. ఈనెల 14న మిథునరాశిలోకి ప్రవేశించిన భానుడు నెలరోజులు అక్కడే ఉంటాడు. దాదాపు ఏడాది సమయం తర్వాత మిథునరాశిలోకి సూర్యుడు ప్రవేశించాడు. దీనివల్ల శుభ ఫలితాలతోపాటు అశుభ ఫలితాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ప్రధానంగా మూడు రాశులవారికి లాభాలు కలగనున్నాయి. అన్నీ ఆర్థిక ప్రయోజనాలేనని జ్యోతిష్యులు తెలిపారు. ఏ రాశులవారికి ఏవిధంగా కలిసివస్తుందో తెలుసుకుందాం.
తులారాశి
విద్యార్థులకు చాలా బాగుంటుంది. పోటీ పరీక్షలు రాస్తే సులభంగా విజయాలు దక్కుతాయి. ఆత్మవిశ్వాసంతో ఎటువంటి పనినైనా పూర్తిచేస్తారు. ఈ సమయంలో తల్లిదండ్రుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆర్థికంగా సహకారం అందడంతోపాటు పనులన్నీ ఈజీగా నెరవేరతాయి. వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాలున్నాయి. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం వెచ్చిస్తారు. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనులన్నీ విజయాన్ని సాధింపచేస్తాయి.

వృశ్చిక రాశి
అదృష్టం తోడుండటంవల్ల పనులన్నీ సులువుగా పూర్తవుతాయి. ఆధ్యాత్మిక పరమైన విషయాలపట్ల ఆసక్తి చూపుతారు. విదేశాలకు వెళ్లే అవకాశం కనపడుతోంది. కష్టపడి పనిచేయడంవల్ల జీవితంలో ఎదుగుతారు. సమాజంలో కీర్తి, ప్రతిష్టలు కలగడంతోపాటు గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. ఈ సమయంలో ఆశించిన ఫలితాలు పొందుతారు. గతంలో మొదలై నిలిచిపోయిన పనులను సులభంగా పూర్తిచేస్తారు. పోటీపరీక్షలు రాసేవారు విజయాలు సాధిస్తారు.
మీన రాశి
సూర్యుడి అనుగ్రహం వీరికి బాగా ఉంటుంది. ధనలాభాలు కలుగుతాయి. ఒంటరి జీవితం గడుపుతున్నవారికి వివాహం అవుతుంది. కెరీర్ కు సంబంధించి అనేక లాభాలున్నాయి. ఉద్యోగాలు చేసేవారికి కొత్త స్థానానికి వెళతారు. వ్యాపారాలు చేసేవారికి బాగా కలిసివస్తుంది. దూర ప్రయాణాలు చేయడంవల్ల కూడా లాభాలున్నాయి. చేసే ప్రయాణం కూడా ఆర్థికంగా లాభాన్ని కలిగిస్తుంది. వైవాహిక జీవితంలో ఉన్న దంపతుల మధ్య అనుబంధం బలోపేతమవుతుంది.












Click it and Unblock the Notifications