మే నెలలో ఈ రాశులు పట్టిందల్లా బంగారమే
సమస్త ప్రాణకోటికి కాంతిని ప్రసాదించే సూర్యుడు నెలకొకసారి తన రాశిని మారుస్తుంటాడు. ఇలా ఏడాది మొత్తం మీద 12 రాశి చక్రాల్లో సంచరిస్తాడు. భాస్కరుడి రాశి మార్పునే మన పంచాంగకర్తలు సంక్రాంతి అని పిలుస్తారు. ప్రస్తుతం మేషరాశిలో సంచరిస్తున్న సూర్యుడు ఈనెల 14వ తేదీన శుక్రుడి రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు వృషభరాశిలో వచ్చే నెల 14వ తేదీ వరకు ఉంటాడు. దీనివల్ల మూడు రాశులవారి జీవితాల్లో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆర్థికంగా ప్రయోజనాలు కలుగుతాయి.
సింహరాశి
ఈ రాశికి అధిపతి సూర్యుడు. ఈ రాశివారు గతంలో ఎన్నడూ పొందని ప్రయోజనాలను పొందుతారు. కెరీర్ లో ఉన్నతస్థాయికి చేరుకుంటారు. తల్లిదండ్రులు మిమ్మల్ని చూసి గర్విస్తారు. ఇతరులతో మీ బంధం బలోపేతమవుతుంది. జీవితం సాఫీగా సాగుతుంది. ఉద్యోగస్తులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ప్రమోషన్ ను పొందుతారు. వేతనం కూడా పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.

మేషరాశి
ఈ రాశివారు ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు. భారీ మొత్తంలో ధనం వస్తుంది. ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా మెరుగుపడుతుంది. ఉన్న అప్పులన్నీ తీరిపోతాయి. వ్యాపారస్తులకు నాలుగురెట్ల లాభాలున్నాయి. ఎంతోకాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో కచ్చితంగా విజయం సాధిస్తారు. కష్టానికి తగినట్లుగా ప్రతిఫలం లభిస్తుంది. శ్రమించే తత్వం ఉంది.
కుంభ రాశి
ఆదిత్యుడి సంచారం వీరికి మంచి ప్రయోజనాలు కలిగించనుంది. భారీగా స్థిరచరాస్తులు కొనుగోలు చేయడంతోపాటు ఇంటికోసం ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంగారు ఆభరణాలను భారీగా కొంటారు. జీవితంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. పిల్లలు లేని దంపతులకు సంతానం కలుగుతుంది. కెరీర్ గతంకన్నా చాలా బాగుంటుంది. ఆధ్యాత్మికపరమైన కార్యక్రమాలపట్ల ఆసక్తి చూపుతారు. కుటుంబ సభ్యులు లేదంటే సన్నిహితులతో కలిసి తీర్థయాత్రలకు వెళతారు. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.












Click it and Unblock the Notifications