గత నెల 29 నుంచే ఈ రాశుల తలరాత మారింది!
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని రాజయోగాలను ఏర్పాటు చేస్తుంటాయి. గత నెల 29వ తేదీన బుధుడు, వరుణుడు 120 డిగ్రీల కోణంలో కలుసుకుంటారు. బుధుడు వృశ్చిక రాశిలోకి, వరుణుడు మీన రాశిలోకి ప్రవేశించడంద్వారా ఏర్పడిన ఈ యోగం 14 సంవత్సరాల తర్వాత వచ్చింది. దీని ప్రభావంతో లాభపడే రాశుల వివరాలను తెలుసుకుందాం.
వృషభ రాశి
కొత్తగా ఇంటిని లేదంటే వాహనాన్ని కొనుగోలు చేస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఊహించనిరీతిలో లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి వేతనం పెరుగుదలతోపాటు పదోన్నతి ఉంది. ఆదాయం డబుల్ అవుతుంది. మీరు వేసే ప్రణాళికలన్నీ విజయవంతమై మంచి పేరు లభిస్తుంది. సమాజంలో కీర్తి, ప్రతిష్టలు కలుగుతాయి.

సింహరాశి
వీరికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఏ పనినైనా ధైర్యంతో పూర్తిచేస్తారు. గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులను ఈ సమయంలోనే పూర్తిచేస్తారు. ఆదాయం పెరగడానికి అదనపు మార్గాలు తోడవుతాయి. సమాజంలో పేరు ప్రతిష్టలు కలుగుతాయి. ఇంట్లో శుభకార్యం ఉంది. విదేశాలకు వెళ్లాలనుకునేవారి కోరిక ఈ సమయంలోనే నెరవేరుతుంది. నైపుణ్యాన్ని పెంచుకుంటారు.
మేష రాశి
ఏ పని తలపెట్టినా జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణమైన సహకారం అందుతుంది. కొత్త అవకాశాలు తలుపు తడతాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు ఆదాయాన్ని అందుకుంటారు. కెరీర్ చాలా బాగుంటుంది. వ్యాపారం కోసం చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మంచి పేరు వస్తుంది. ఒకరకంగా ఈ రాశివారికి మంచిరోజులు వచ్చాయని చెప్పొచ్చు.












Click it and Unblock the Notifications